కోర్టుకు హాజ‌రైన సినీ న‌టి జీవితా రాజ‌శేఖ‌ర్‌ (Jeevitha Rajasekhar)

Updated on Aug 11, 2022 07:12 PM IST
త‌న న్యాయ‌వాదుల‌తో క‌లిసి కోర్టుకు వెళ్లిన జీవిత (Jeevitha Rajasekhar)  త‌న స‌మ‌స్య‌ను కోర్టులో వెల్ల‌డించారు.
త‌న న్యాయ‌వాదుల‌తో క‌లిసి కోర్టుకు వెళ్లిన జీవిత (Jeevitha Rajasekhar) త‌న స‌మ‌స్య‌ను కోర్టులో వెల్ల‌డించారు.

టాలీవుడ్ న‌టి, ద‌ర్శ‌కురాలు జీవితా రాజ‌శేఖ‌ర్  (Jeevitha Rajasekhar) ఓ కేసు విష‌య‌మై చిత్తూరు జిల్లాలోని న‌గ‌రి కోర్టుకు హాజ‌ర‌య్యారు. జీవిత, రాజశేఖర్ దంపతులు గరుడవేగ సినిమా కోసం త‌మ ద‌గ్గ‌ర అప్పు తీసుకుని చెల్లించ‌లేదంటూ జోస్ట‌ర్ గ్రూప్ యాజ‌మాన్యం గ‌త కొన్ని రోజుల నుంచి చెబుతున్న సంగ‌తి తెలిసిందే. త‌మ ద‌గ్గ‌ర తీసుకున్న న‌గ‌దు చెల్లించ‌లేదంటూ జోస్ట‌ర్ గ్రూప్ యాజ‌మాన్యం కోర్టుకెక్కింది. దీంతో కోర్టు జీవితా రాజ‌శేఖ‌ర్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 

చెక్ బౌన్స్ కేసు

గరుడవేగ సినిమా కోసం జీవితా రాజ‌శేఖ‌ర్ (Jeevitha Rajasekhar) ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయింద‌ని జోస్ట‌ర్ గ్రూప్ యాజ‌మాన్యం న‌గ‌రి కోర్టుకు తెలిపింది. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు జీవితా రాజ‌శేఖ‌ర్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో జీవితా రాజ‌శేఖ‌ర్ కోర్టుకు వెళ్లారు. త‌న న్యాయ‌వాదుల‌తో క‌లిసి కోర్టుకు వెళ్లిన జీవిత త‌న స‌మ‌స్య‌ను కోర్టులో వెల్ల‌డించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని త‌మ‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై జీవితా రాజ‌శేఖ‌ర్ తెలిపారు. కొంద‌రు వ్య‌క్తుల వ‌ల్ల త‌మ మేనేజ‌ర్లు ఇబ్బంది ప‌డ్డార‌న్నారు.

Read More: Balakrishna : బాల‌కృష్ణ సినిమాలో విల‌న్‌గా రాజ‌శేఖ‌ర్ ! డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం అట్లుంట‌ది.. !

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!