రెండో రోజు కూడా పడిపోయిన నితిన్ (Nithiin) మాచర్ల నియోజకవర్గం కలెక్షన్లు! పెరిగే చాన్స్ లేనట్టే

Updated on Aug 14, 2022 11:17 PM IST
నితిన్ (Nithiin) మాచర్ల నియోజకవర్గం కలెక్షన్లు పెరిగే అవకాశాలు దాదాపుగా లేనట్టేనని ఇండస్ట్రీ టాక్
నితిన్ (Nithiin) మాచర్ల నియోజకవర్గం కలెక్షన్లు పెరిగే అవకాశాలు దాదాపుగా లేనట్టేనని ఇండస్ట్రీ టాక్

నితిన్ (Nithiin), కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. ఆగస్టు 12వ తేదీన రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను దక్కించుకోలేకపోయింది. కొత్త దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్‌‌ రెడ్డి డైరెక్షన్‌తో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమా కలెక్షన్లు తగ్గాయని టాక్.

ప్రమోషన్లలో భాగంగా మాచర్ల నియోజకవర్గం సినిమా నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా ట్రైలర్‌‌కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. రొమాంటిక్, యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్‌తో 'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచేసింది.

అయితే భారీ అంచనాల మధ్య రిలీజైన సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. అయినప్పటికీ మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో సినిమా కలెక్షన్లపై భారీ ప్రభావం పడింది. దీంతో రెండో రోజు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. 

నితిన్ (Nithiin) మాచర్ల నియోజకవర్గం కలెక్షన్లు పెరిగే అవకాశాలు దాదాపుగా లేనట్టేనని ఇండస్ట్రీ టాక్

రెండు రోజుల కలెక్షన్స్ గమనిస్తే :

నైజాం  1.98 Cr

సీడెడ్ 0.93 Cr

ఉత్తరాంధ్ర  0.87 Cr

ఈస్ట్ 0.58 Cr

వెస్ట్ 0.25 Cr

గుంటూరు 0.64 Cr

కృష్ణా 0.40 Cr

నెల్లూరు 0.33 Cr

ఏపీ + తెలంగాణ 5.98 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.34 Cr

ఓవర్సీస్ 0.32 Cr

వరల్డ్ వైడ్ 6.64 Cr

'మాచర్ల నియోజకవర్గం' సినిమాకు రూ.18.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కోసం రూ.19 కోట్ల షేర్ రాబట్టాలి. మాచర్ల నియోజకవర్గం సినిమా రిలీజై రెండు రోజులు పూర్తయ్యేసరికి రూ.6.64 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్‌కు మరో రూ.12.36 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.

బింబిసార, సీతారామం, కార్తికేయ2 సినిమాలు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్నాయి. ఈ సమయంలో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న నితిన్ (Nithiin) మాచర్ల నియోజకవర్గం సినిమా వసూళ్లు పెరిగే చాన్స్‌లు చాలా తక్కువనే చెప్పాలి.  

Read More : అలా కలిసొచ్చింది నితిన్‌ (Nithiin)కు మాత్రమే : ఒకే యూనిట్‌తో రెండు సినిమాల్లోని పాటలు.. !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!