హీరో నితిన్ (Nithiin), వెంకీ కుడుముల (Venky Kudumula) బ్లాక్ బస్టర్ మూవీ 'భీష్మ' (Bheeshma) కాంబో రిపీట్..?

Updated on Nov 06, 2022 11:12 AM IST
'భీష్మ' (Bheeshma) సక్సెస్ తర్వాత వెంకీ.. మెగాస్టార్ చిరంజీవితో (Megastar Chirajeevi) సినిమా చేయాల్సిఉంది.
'భీష్మ' (Bheeshma) సక్సెస్ తర్వాత వెంకీ.. మెగాస్టార్ చిరంజీవితో (Megastar Chirajeevi) సినిమా చేయాల్సిఉంది.

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Hero Nithiin), రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో 2020లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'భీష్మ' (Bheeshma). ‘అఆ!’ తర్వాత నితిన్‌ కెరీర్‌లో ఆ స్థాయిలో హిట్ అయింది ఈ చిత్రం. 'భీష్మ' మూవీ లో మ్యూజిక్, నితిన్‌ కామెడీ టైమింగ్‌, పర్‌ఫార్మెన్స్‌, రష్మిక – నితిన్ లవ్ ట్రాక్, రొమాన్స్ ఇవన్నీ కూడా ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఇక వెంకీ టేకింగ్, పంచ్‌ డైలాగ్స్ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌చేశాయి.

ఇక, వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్‌కు (Hero Nithiin) క‌మ‌ర్షియ‌ల్‌ బ్రేక్ ఇచ్చింది 'భీష్మ' (Bheeshma) మూవీ. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా రూ.40 కోట్ల‌కుపైగా కలెక్ష‌న్స్ రాబ‌ట్టింది. వెంకీ కుడుముల సోష‌ల్ మెసేజ్‌ను కామెడీతో చ‌క్క‌గా ఆవిష్క‌రించిన తీరుకు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అయితే, వెంకీ కుడుముల‌తో మ‌రో సినిమా త‌ప్ప‌కుండా చేస్తాన‌ని భీష్మ ప్ర‌మోష‌న్స్‌లోనే నితిన్ చెప్పాడు. తాజాగా ఆ మాట‌ను నిల‌బెట్టుకున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. 

వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్‌కు (Hero Nithiin) క‌మ‌ర్షియ‌ల్‌ బ్రేక్ ఇచ్చింది 'భీష్మ' (Bheeshma) మూవీ. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా రూ.40 కోట్ల‌కుపైగా కలెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. 'భీష్మ' (Bheeshma) సక్సెస్ తర్వాత వెంకీ.. మెగాస్టార్ చిరంజీవితో (Megastar Chirajeevi) సినిమా చేయాల్సిఉంది. కానీ చిరుకు ఫైనల్‌ నేరేషన్‌ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ క్యాన్సిల్‌ అయింది. ఈ క్రమంలో వెంకీ కుడుముల, నితిన్‌కు మరో కథను వినిపించాడట. నితిన్‌కు కూడా కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడని టాక్‌. ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక, ఈ మూవీని మైత్రీ సంస్థ నిర్మించనుట్లు తెలుస్తోంది. 

కాగా ప్ర‌స్తుతం నితిన్ (Hero Nithiin) ర‌చ‌యిత వ‌క్కంతం వంశీతో ఓ సినిమా చేయ‌బోతున్నారు. స్వీయ‌నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ ప‌తాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఇటీవలే నితిన్‌ నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజై బాక్సాఫీస్‌ దగ్గర ఫ్లాప్‌గా మిగిలింది. ఎడిటర్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఆగస్టు 12న విడుదలై నెగెటీవ్‌ టాక్‌ తెచ్చుకుంది. మరి వక్కంతం వంశీతో తర్వాతి సినిమా చేస్తాడా లేదా వెంకీ కుడుములతో చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

Read More: Macherla Dhamki: నితిన్ హీరోగా నటించిన 'మాచర్ల నియోజకవర్గం' అదిరిపోయే ధమ్కీ వీడియో విడుదల.. ట్రైలర్ జులై30న!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!