టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ (Rajashekar) హీరోగా ‘మాన్‌స్టర్‌’ (Monster).. లాంఛనంగా ప్రారంభం

Updated on Aug 24, 2022 02:11 PM IST
రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘మాన్‌స్టర్‌’ (Monster) అనే టైటిల్‌ ఖరారు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది ఈ చిత్రం.
రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘మాన్‌స్టర్‌’ (Monster) అనే టైటిల్‌ ఖరారు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది ఈ చిత్రం.

టాలీవుడ్ సీనియర్ హీరో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) ఫ్యామిలీ, యాక్ష‌న్ హీరోగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. 'గరుడవేగ' సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అదిరిపోయే రీతిలో స్టార్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత రాజ‌శేఖ‌ర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ ఏడాది వ‌చ్చిన 'శేఖ‌ర్' సినిమా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ అందుకోలేక‌పోయింది. 

దీంతో 'శేఖర్' (Shekar Movie) సినిమా తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఈ సీనియర్ హీరో. ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ ఓ యాక్షన్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 'సేనాప‌తి' ఫేం పవన్ సాధినేని (Pavan Sadineni) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించబోతోంది. కాగా, రాజశేఖర్ కెరీర్ లో 92వ సినిమా ఇది కావడం విశేషం.  

మల్కాపురం శివ కుమార్‌ నిర్మాతగా వ్యవహరించబోతున్న ఈ చిత్రానికి ‘మాన్‌స్టర్‌’ (Monster) అనే టైటిల్‌ ఖరారు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది ఈ చిత్రం. తొలి సన్నివేశానికి ప్రవీణ్‌ సత్తారు క్లాప్‌నివ్వగా.. ప్రసన్న కుమార్‌ స్విచ్చాన్‌ చేశారు. ప్రశాంత్‌ వర్మ గౌరవ దర్శకత్వం వహించారు.  

అంతకుముందు ‘మాన్‌స్టర్‌’ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్‌ను (Monster Poster) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లోనే టైటిల్‌ను ఆడియెన్స్ డీకోడ్ చేయాలంటూ వారికి ఓ పజిల్ ఇచ్చారు. కాగా, ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు పవన్ సాదినేని తెరకెక్కించనుండగా, గిబ్రాన్ (Ghibran) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 

‘‘పోలీసులు, గ్యాంగ్‌స్టర్‌ మధ్య చిక్కుకున్న మాన్‌స్టర్‌ (Monster) కథ ఇది. రాజశేఖర్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మాన్‌స్టర్‌ లక్ష్యం ఏమిటి? తాను ఏం సాధించాడు? అనేది ఆసక్తికరం. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామ’’న్నారు దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే వెల్లడించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Read More: Jani Master: ‘యథా రాజా తథా ప్రజా’ సినిమాతో హీరోగా తెరంగ్రేటం చేయబోతున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!