Aha Naa Pellanta: 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ గురించిన టాప్ 10 ఆసక్తికర విశేషాలు మీకోసం..

Updated on Nov 16, 2022 08:08 PM IST
Aha Naa Pellanta: 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్లుగా జీ5లో నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Aha Naa Pellanta: 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్లుగా జీ5లో నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Aha Naa Pellanta: టాలీవుడ్ హీరో, హీరోయిన్లు దూకుడు మీద ఉన్నారు. అందివచ్చిన అవకాశాలను వదులుకోకుండా తమ టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. బుల్లితెర, వెండితెర లేక ఓటీటీ తెర అనేది ముఖ్యం కాదు ప్రేక్షకులకు వినోదం అందించామా లేదా అనేది ముఖ్యం అంటున్నారు. అందుకు ఉదాహరణ అహ నా పెళ్లంట వెబ్ సిరీస్ లో నటించిన హీరో  రాజ్ తరుణ్ (Raj Tarun), హీరోయిన్ శివాని రాజశేఖర్. అహ నా పెళ్లంట వెబ్ సిరీస్ కు సంబంధించిన పలు ఆసక్తిరమైన విశేషాలు పింక్ విల్లా ఫాలోవర్స్ కోసం..

Aha Naa Pellanta: 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్

1. వెబ్ సిరీస్ కథ ఏంటి?

ఓ యువకుడు తల్లిదండ్రుల చెప్పిన పెళ్లి సంబంధం చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఎన్నో పెళ్లి చూపులు చూస్తాడు. ఫైనల్ గా పెళ్లి జరుగుతుందనుకున్న సమయంలో పెళ్లి కూతురు మరొకరితో లేచిపోవడంతో ఆ యువకుడి పెళ్లి పెటాకులవుతుంది. దీంతో తనను మోసం చేసిన అమ్మాయిపై ఆ యువకుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకునే కథతో అహ  నా పెళ్లంట వెబ్ సిరీస్ సాగుతుంది. 

2. డైరెక్షన్ గురించి 

అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ(అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి) సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. అంతేకాదు తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అహ నా పెళ్లంట వెబ్ సిరీస్ జీ 5 ద్వారా సంజీవ్ రెడ్డికి దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. సంజీవ్ రెడ్డి కామెడీ, యూత్ ఫుల్ ఎంటర్ ట్రైన్ మెంట్ గా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు.

3. నటీ నటులు ఎవరు?

రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ (Shivani Rajasekhar), హర్ష వర్థన్, ఆమని, పోసాని కృష్ణ మురళి , గెటప్ శ్రీను, మహ్మాద్ అలీ, రవి తేజలు ఈ సిరీస్ లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

4. ఆ నటులకు మొదటి వెబ్ సిరీస్

రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ ఇప్పటి వరకు వెండితెరపైన సందడి చేశారు. వీరిద్దరు మొదటి సారి నటించిన వెబ్ సిరీస్ అహ నా పెళ్లంట.

5. నిర్మాతలు ఎవరంటే..
అహ నా పెళ్లంట వెబ్ సిరీస్ కు తమడా మీడియా అధినేత సూర్య రాహుల్, సాయిదీప్ రెడ్డి బొర్రాలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

6. కథ, స్క్రీన్ ప్లే

అహ నా పెళ్లంట సినిమా కథను షేక్ దావూద్. జి అందించారు. అలాగే స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా వ్యవహరించారు.

7. మిగతా టెక్నీషియన్స్
అహ నా పెళ్లంట వెబ్ సిరీస్ ఎడిటర్ గా మాధవ్ రెడ్డి, డైలాగులు కళ్యాణ్ రాఘవ్, ప్రొడక్షన్ డిజైనర్ దివ్యారెడ్డి, స్టంట్స్ రామకృష్ణ, కొరియో గ్రాఫర్ గా ఈశ్వర్ వ్యవహరించారు.

8. ఎన్ని ఎపిసోడులంటే..
అహ నా పెళ్లంట ఎనిమిది ఎపిసోడ్లుగా సాగే వెబ్ సిరీస్. అన్ని ఎపిసోడ్లను ఒకేసారి ఓటీటీలోకి రిలీజ్ చేయనున్నారు.

9.మ్యూజిక్
ఈ వెబ్ సిరీస్ లో పాటలు కూడా హైలెట్ కానున్నాయి. కన్నడ సంగీత దర్శకుడు జుడ్డా సాంధీ అహ నా పెళ్లంట సినిమాకు అద్భుతమైన సంగీతం అందించారు. గాయకుడు  కృష్ణ తేజస్వీ ఈ సిరీస్ పాటలను ఆలపించారు.

10.రిలీజ్ ఎప్పడంటే
రాజ్‌ తరుణ్, శివాని రాజశేఖర్  ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ఆహా నా పెళ్ళంట’ జీ-5లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నవంబర్‌ 17నుంచి 8 ఎపిసోడ్లగా స్ట్రీమింగ్‌ కానుంది.

Read More: EXCLUSIVE: "నటనలో సెంచరీలు ఉండాలే కానీ.. బౌండరీలు ఎందుకు ?" : రాజ్ తరుణ్ (Raj Tarun)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!