‘జీ5’ ఓటీటీలోకి నితిన్ (Hero Nithiin) ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam).. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Updated on Nov 26, 2022 12:58 PM IST
'మాచర్ల నియోజకవర్గం' (Macherla Niyojakavargam) మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'మాచర్ల నియోజకవర్గం' (Macherla Niyojakavargam) మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Hero Nithiin), 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా జంటగా నటించిన పొలిటికల్ యాక్షన్ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. 

ఆగస్ట్ 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ సినిమా ఆల్ మోస్ట్ 950 వరకు థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్‌ను సొంతం చేసుకుంది. ట్రైలర్, టీజర్స్‌, పాటలతో మంచి పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా విడుదలైన తర్వాత మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. మొన్నటి వరకు లవ్‌స్టోరీ సినిమాలలో నటించే నితిన్‌ (Hero Nithiin).. ఈ సారి తన జానర్‌కు భిన్నంగా పూర్తి స్థాయి సీరియస్‌ కథతో వచ్చి ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా క‌లెక్టర్‌గా క‌నిపించాడు.

ఇదిలా ఉంటే..  మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని పలువురు ప్రేక్షకాభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్ గా ఈ మూవీని డిసెంబర్ 9న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'జీ5' ఓటీటీలో (ZEE 5 Ott) విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి అటు థియేటర్స్ లో పెద్దగా పెర్ఫార్మ్ చేయని ఈ మూవీ ఓటీటీలో ఏ మేరకు ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

'మాచర్ల నియోజకవర్గం' (Macherla Niyojakavargam) కథ విషయంలోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ అందుకున్న హీరో ఫ్యాక్షన్ ను తలపించే మాచర్ల నియోజకవర్గ రూపురేఖలను ఎలా మార్చాడు? అక్కడి పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు? ఈ క్రమంలో హీరో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్న కథాంశంతో నూతన దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించారు.

Read More: Ra Ra Reddy Song: 500 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్న 'మాచర్ల నియోజకర్గం' (Macherla Niyojakavargam) సాంగ్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!