Rana Naidu: వెంకటేష్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో నెట్ ఫ్లిక్స్ సిరీస్.. షూటింగ్ పూర్తి !

Updated on May 26, 2022 12:46 PM IST
 అమెరికా‌లో సూపర్ డూపర్ హిట్ అయిన సిరీస్ "రే డోనోవ్యాన్‌" దీనికి ప్రేరణ. ఇటీవలే రానా నాయుడు సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
అమెరికా‌లో సూపర్ డూపర్ హిట్ అయిన సిరీస్ "రే డోనోవ్యాన్‌" దీనికి ప్రేరణ. ఇటీవలే రానా నాయుడు సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

టాలీవుడ్ కథానాయకులు ద‌గ్గుబాటి వెంక‌టేశ్, రానా కాంబినేషన్‌లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిస్తున్న నెట్ ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu). తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. అమెరికా‌లో సూపర్ డూపర్ హిట్ అయిన సిరీస్ "రే డోనోవ్యాన్‌" దీనికి ప్రేరణ. ఇటీవలే రానా నాయుడు సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

సుప‌న్ వ‌ర్మ‌, క‌ర‌ణ్ అన్షుమాన్ ద్వయం ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. వీరు గతంలో మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌లకు దర్శకత్వం వహించారు. సుంద‌ర్ ఆర‌న్ ఆఫ్ లోకొమోటివ్ గ్లోబ‌ల్ మీడియా ఎల్ఎల్‌పీ ఈ సిరీస్‌ను నిర్మిస్తోంది. క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. తెలుగు రైటర్ బివిఎస్ రవి కూడా ఈ సిరీస్‌కు రచనా సహకారం ఇవ్వడం విశేషం. 

ప్రస్తుతం వెంకటేష్ (Venkatesh) నటించిన "F 3" చిత్రం విడుదలకు సిద్ధమవుతుందన్న సంగతి తెలిసిందే. అలాగే వేణు ఊడుగుల డైరెక్ష‌న్‌లో రానా న‌టిస్తోన్న‌ విరాట ప‌ర్వం సినిమా కూడా జులై 1న విడుద‌ల కానుంది. రానా (Rana Daggubati) గతంలో Viu సంస్థ నిర్మించిన "సోషల్" అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. 

రానా నాయుడు వెబ్ సిరీస్‌కు సంబంధించి కథలోని ఎక్కువ భాగం ముంబయి, హైదరాబాద్‌ల చుట్టూ తిరుగుతుంది. అభిషేక్ భలేరావ్, సౌరవ్ ఖురానా ఈ సిరీస్‌లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!