Hello World Web Series: 'ఆర్యన్ రాజేష్' ప్రధాన పాత్రలో 'హలో వరల్డ్' వెబ్ సిరీస్.. ఆగస్టు12 నుంచి జీ5లో ప్రసారం

Updated on Jul 26, 2022 05:14 PM IST
తాజాగా ఆర్యన్ రాజేశ్ (Aryan Rajesh) ఓ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే ‘హలో వరల్డ్’ (Hello World). 
తాజాగా ఆర్యన్ రాజేశ్ (Aryan Rajesh) ఓ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే ‘హలో వరల్డ్’ (Hello World). 

Hello World: లెజెండరీ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ తనయులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేశ్ టాలీవుడ్ లో పలు సినిమాలతో ఆకట్టుకున్నారు. చిన్న కుమారుడు అల్లరి నరేష్ అయితే.. తనదైన శైలిలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే మరో కుమారుడు ఆర్యన్ రాజేష్ ‘హాయ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అంతగా విజయం సాధించకపోయినా..  ఆర్యన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. 

అయితే, ఆర్యన్ రాజేష్ (Aryan Rajesh) కెరీర్ లో ఏ సినిమా కూడా చెప్పుకునేంత సక్సెస్ ఫుల్ గా ఆడలేదు. ఈ నేపథ్యంలో సినిమాలకు కొంత కాలం గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో రామ్ చరణ్ అన్న పాత్రలో కనిపించాడు. ఇక, తాజాగా ఆర్యన్ రాజేశ్ ఓ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే ‘హలో వరల్డ్’. 

‘హలో వరల్డ్’ అనే ఈ సరికొత్త వెబ్ సిరీస్ ని (Hello World Webseries) ఆగష్టు 12 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్ సిరీస్ లో ఎనిమిది మంది యువతీ యువకులు ఒక ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తూ తమ ఫ్యూచర్ గురించి పలు ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారి లైఫ్ లో ఎటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అనే కథాంశంతో తెరకెక్కిందే ఈ వెబ్ సిరీస్. శివ సాయి వర్ధన్ జలదంకి ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్ ను తెరక్కించారు. మొత్తంగా 8 ఎపిసోడ్స్ తో మంచి ఎంటర్టైనింగ్ గా ఆసక్తికరంగా ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో ప్రసారం కానుంది.

జీ5లో (Zee5 OTT) ఆర్యన్ రాజేశ్ ఇప్పటికే ముఖాముఖం, ఎక్కడికీ పరుగు అనే రెండు వెబ్‌సిరీస్‌లు చేశాడు ఇక మూడవ వెబ్‌సిరీస్‌ కూడా జీ5లో విడుదలవుతుండడం విశేషం. ఆర్యన్ రాజేష్ తో పాటు సదా, రామ్ నితిన్, నయన్ కరిష్మా, సుదర్శన్ గోవింద్, నిత్యా శెట్టి, నిఖిల్ సింహా, అపూర్వ రావు, అనిల్ జీల, స్నేహాల్ కామత్, రవి వర్మ, జయప్రకాశ్ నటించిన ఈ వెబ్ సిరీస్ కి మ్యూజిక్ ని పీకే దండి అందించగా ఎడురోలు రాజు ఫోటోగ్రఫి అందించారు. మరి త్వరలో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుఉంటుందో చూడాలి.

Read More: 'పరంపర 2' సిరీస్‌లో జగపతిబాబు, శరత్ కుమార్ ! వీరి పాత్రలపై వీక్షకులలో పెరుగుతున్న ఆసక్తి

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!