Maa Neella Tank Teaser: అక్కినేని సుశాంత్ హీరోగా 'మా నీళ్ల ట్యాంక్' వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న టీజర్!

Updated on Jun 28, 2022 06:34 PM IST
'మా నీళ్ల ట్యాంక్' మూవీ పోస్టర్ (Maa Neella Tank Movie Poster)
'మా నీళ్ల ట్యాంక్' మూవీ పోస్టర్ (Maa Neella Tank Movie Poster)

Maa Neella Tank Teaser: అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ (Sushanth) 'మా నీళ్ల ట్యాంక్' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్‌లో రూపుదిద్దుకుంటోంది. కాగా దాదాపు 10 సంవత్సరాల విరామం తర్వాత ప్రియా ఆనంద్ (Priya Anand) తెలుగు తెరపై కనిపించబోతోంది.

‘మా నీళ్ల ట్యాంక్’ అనే వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేసేందుకు జీ5 రెడీ అయ్యింది. ఈ వెబ్ సిరీస్ ఒక చిన్న పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ అని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ప్యూర్ రొమాంటిక్ కామెడీతో రాబోతున్న ‘మా నీళ్ల ట్యాంక్’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను తాజాగా రిలీజ్ చేసింది జీ5. 

ఆద్యంతం వినోదభరితంగా సాగిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఇందులో సుశాంత్ (Hero Sushanth) పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. బుచ్చివోలు అనే గ్రామంలోని నీళ్ల ట్యాంక్ చుట్టూ ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. ఆ ఊరి పెద్ద కోదండం కొడుకు గోపాల్ (సుదర్శన్) నీళ్ళ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు.

తాను ప్రేమించిన సురేఖ (ప్రియా ఆనంద్) ను తిరిగి తీసుకొస్తే కానీ, ఆ ట్యాంక్ పై నుండి తాను దిగనని బెదిరిస్తాడు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తన కొడుకు ఇలా చేయడంతో కంగుతిన్న కోదండం.. సురేఖను తీసుకొచ్చే బాధ్యతను సబ్ ఇన్స్పెక్టర్ అయిన సుశాంత్‌కు అప్పగిస్తాడు.

ఈ పని చేస్తే అతను కోరుకుంటున్నట్టు, ఆ ఊరి నుండి ట్రాన్సఫర్ చేస్తానని హామీ ఇస్తాడు. అయితే ప్రియా ఆనంద్‌ను సుశాంత్ కూడా ప్రేమిస్తున్నట్లు టీజర్‌ని బట్టి తెలుస్తోంది.

 

ఇక ఈ వెబ్ సిరీస్‌లో సుశాంత్‌తో పాటు ప్రియా ఆనంద్, సుదర్శన్, ప్రేమ్ సాగర్, నిరోషా, రామరాజు, దివి, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్నారు. (Director Lakshmi Sowjanya)  ఈ వెబ్ సిరీస్‌కు సునీల్ కశ్యప్ సంగీతం అందించగా, ప్రవీణ్ కొల్లా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను జూలై 15న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు జీ5 ప్రకటించింది. ఈ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్స్‌గా అందుబాటులోకి రానుంది. 

కాగా, ఇటీవలే రిలీజ్ చేసిన 'మా నీళ్ల ట్యాంక్' (Maa Neella Tank First Look) ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ టీజర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. వెబ్ సిరీస్ కోసం వేచి చూసేలా చేస్తోంది. విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తుండటంతో, ఈ సిరీస్ బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్ సుశాంత్‌కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

Read More: Sushanth : అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్‌‌కు ఎదురైన వింత ప్రశ్న.. ఆసక్తికర సమాధానమిచ్చిన యువ నటుడు !

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!