Parampara 2 : 'పరంపర 2' సిరీస్‌లో జగపతిబాబు, శరత్ కుమార్ ! వీరి పాత్రలపై వీక్షకులలో పెరుగుతున్న ఆసక్తి

Updated on Jul 02, 2022 06:30 PM IST
ఇప్పుడు పరంపరకు (Parampara) సీక్వెల్ కూడా వస్తోంది. పరంపర 2 (Parampara 2) పేరుతో తెరకెక్కుతున్న ఈ సిరీస్‌కు హరి యేలేటి కథను అందిస్తున్నారు.
ఇప్పుడు పరంపరకు (Parampara) సీక్వెల్ కూడా వస్తోంది. పరంపర 2 (Parampara 2) పేరుతో తెరకెక్కుతున్న ఈ సిరీస్‌కు హరి యేలేటి కథను అందిస్తున్నారు.

ఇప్పుడు అంతా వెబ్ సిరీస్‌లదే హవా నడుస్తోంది. ఈ క్రమంలో పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇప్పుడు ఇవే సిరీస్‌లను నమ్ముకుంటున్నారు. ఒకప్పుడు హీరోలుగా చలనచిత్ర పరిశ్రమను ఏలిన వారు కూడా, ఇప్పుడు వెబ్ సిరీస్‌ల ద్వారానే తమ లక్‌ను పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ ప్రేక్షకులకు కావాల్సిన కంటెంట్‌ను అందిస్తున్నారు. 

పెద్ద స్టార్లతో హిట్ కొట్టిన వెబ్ సిరీస్‌ల విషయానికి వస్తే, అందులో పరంపర ఒకటి. హాట్ స్టార్ ద్వారా విడుదల అయిన ఈ సిరీస్ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి ఒక పెద్ద ప్రభంజనమే క్రియేట్ చేసింది. జగపతిబాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర లాంటి వారందరూ ఈ సిరీస్‌లో నటించారు. చిత్రమేంటంటే, వీరందరూ కూడా ఒకప్పుడు వెండితెర పై హీరోలుగా చేసిన వారే.

ఇప్పుడు పరంపరకు (Parampara) సీక్వెల్ కూడా వస్తోంది. పరంపర 2 (Parampara 2) పేరుతో తెరకెక్కుతున్న ఈ సిరీస్‌కు హరి యేలేటి కథను అందిస్తున్నారు. కృష్ణ విజయ్‌, విశ్వనాథ్‌ ఆరిగెళ్ల ఇదే సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం ఇదే సిరీస్‌కు సంబంధించిన టీజర్ విడుదలైంది. ఈ టీజర్ చాలా డిఫరెంట్‌గా ఉందని టాక్. 

'నా ఉద్దేశం నాయుడిని చంపడం కాదు సర్‌, వాడి అహాన్ని దెబ్బకొట్టాలి' అంటూ నవీన్‌ చంద్ర చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్‌ మొదలవుతుంది. జూలై 21న ఈ సిరీస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

ఇక ఈ సిరీస్‌లో లీడ్ రోల్ చేస్తున్న జగపతిబాబు (Jagapathi Babu) విషయానికొస్తే, ఆయన ఒకవైపు సినిమాలు చేస్తూనే, ఇలాంటి వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం జగపతి బాబు 'సలార్' సినిమాతో పాటు హిందీ సల్మాన్ ఖాన్ (Salman Khan) కథానాయకుడిగా తెరకెక్కుతున్న కభీ ఈద్ కభీ దివాలీ చిత్రంలో కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 

Read More: థ్రిల్లింగ్‌గా రెజీనా కసాండ్రా, నివేదితా సతీష్‌ ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్‌ సిరీస్

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!