Modern Love Hyderabad: 6 కథల సమాహారం.. ఆసక్తికరంగా 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' ట్రైలర్!

Updated on Jun 29, 2022 03:00 PM IST
'మోడ్రన్ లవ్ హైదరాబాద్' పోస్టర్ (Modern Love Hyderabad Poster)
'మోడ్రన్ లవ్ హైదరాబాద్' పోస్టర్ (Modern Love Hyderabad Poster)

Modern Love Hyderabad: కరోనా పుణ్యమాని ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మూవీ మేకర్స్ ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన కంటెంట్ ను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇటీవల కాలంలో అనేక వెబ్ సిరీసులు సినిమాలతో సమానంగా విశేష ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెలుగులో ''మోడ్రన్ లవ్ హైదరాబాద్'' అనే మరో సరికొత్త వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. 

రేవతి, నిత్యా మీనన్ (Nithya Menon), ఆది పినిశెట్టి, రీతూ వర్మ, 'బిగ్ బాస్' అభిజిత్ (Bigg Boss Abhijeet), మాళవిక నాయర్ (Malavika Nair), సుహాసిని మణిరత్నం, నరేష్ అగస్త్య, ఉల్కా గుప్తా, నరేష్, కోమలీ ప్రసాద్ ప్రధాన తారలుగా రూపొందిన వెబ్ సిరీస్ 'మోడ్రన్ లవ్ హైదరాబాద్'. మొత్తం ఆరు ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ ను రిలీజ్ చేయబోతున్నారు. అందరూ పేరున్న తారలు కావడంతో ఈ సిరీస్ పై ఆసక్తి క్రియేట్ అయింది. కాగా ఈ ఆంథాలజీ సిరీస్ కు నగేశ్ కుకునూర్ ('గుడ్ లక్ సఖి' ఫేమ్) - వెంకటేశ్ మహా (కేరాఫ్ కంచరపాలెం సినిమా ఫేం) - ఉదయ్ గుర్రాల - దేవికా దర్శకత్వం వహించారు. 

జులై 8వ తేదీ నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. 'భాష కనిపెట్టకముందే మాట్లాడటడం రాకముందే మనుషులు ప్రేమించుకున్నారు' అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. హైదరాబాద్ సిటీ బ్యాక్ డ్రాప్ లో 6 వైవిధ్యమైన కథల సమాహారంగా.. ఆధునిక సంబంధాల గురించి మరియు ప్రేమలోని పలు పార్శ్వాలను ఈ సిరీస్ లో చూపించనున్నారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఆరు ఎపిసోడ్స్ గా రానున్న ఈ ఆంథాలజీలోని 6 కథల్లో ప్రతి ఒక్కటి ఒక నిర్దిష్ట రకమైన సంబంధాన్ని, ప్రేమలోని విభిన్న కోణాన్ని వర్ణించనుందని తెలుస్తోంది.

'మోడ్రన్ లవ్ హైదరాబాద్' ట్రైలర్ లాంఛ్ (Modern Love Hyderabad Trailer Launch) కార్యక్రమంలో ప్రేక్షకులు నటీనటులతో కాసేపు సరదాగా ముచ్చట్లు పెట్టారు.  అయితే ఈ ఈవెంట్‌కు నిత్యా మీనన్ చేతిలో స్టిక్ పట్టుకుని రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె నడవలేని స్థితిలో ఇద్దరు బాడీ గార్డ్స్ సాయంతో వచ్చింది.

అయితే, ఇదే కథాంశంతో హిందీలో రూపొందిన 'మోడర్న్ లవ్ ముంబయి' సిరీస్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. అలాగే తమిళ నేటివిటీకి తగ్గట్టుగా రూపొందించిన 'మోడర్న్ లవ్ చెన్నై' (Modern Love Chennai) సిరీస్ త్వరలోనే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. అంతకంటే ముందుగా ఓటీటీలోకి రాబోతున్న తెలుగు షో 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' ఎలాంటి ఆదరణ తెచ్చుకుంటుందో చూడాలి.

Read More: Maa Neella Tank Teaser: అక్కినేని సుశాంత్ హీరోగా 'మా నీళ్ల ట్యాంక్' వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న టీజర్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!