Anchor Sreemukhi: దుబాయిలో వాలిపోయిన యాంకర్ శ్రీముఖి.. బుర్జ్ ఖలీఫా వద్ద హాట్ హాట్ పోజులు!

Updated on Jun 25, 2022 01:33 PM IST
యాంకర్ శ్రీముఖి (Anchor Sreemukhi)
యాంకర్ శ్రీముఖి (Anchor Sreemukhi)

తెలుగులో గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న వారిలో శ్రీముఖి (Anchor Sreemukhi) ఒకరు. ఈ అందాల యాంకర్‌ కుర్రకారును పిచ్చెక్కించే ఫోటో షూట్లతో కనువిందు చేస్తుందన్న సంగతి తెలిసిందే. నెటిజన్లకి భారీ అందాల విందుని వడ్డిస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి రెచ్చిపోయింది. 

ప్రస్తుతం శ్రీముఖి దుబాయిలోని బూర్జ్ ఖలీఫాతో (Dubai Burj Khalifa) పోటీ పడుతూ అందాల విందు చేస్తోంది. శ్రీముఖిలో దాగి ఉన్న స‌రికొత్త అందాలు అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొడుతున్నాయి. బ్లాక్ డ్రెస్ లో షార్ట్ షాట్ తో గ్లామర్ డోస్ పెంచేసి ఆ ఫొటోస్ ని తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసి కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేసేస్తోంది. అందులో భాగంగా ఆమె బూర్జ్ ఖలీఫాపైకి ఎక్కి అద్భుతమైన వ్యూ పాయింట్‌లో ఫోటోలు దిగింది. ఆ ఎత్తైన బిల్డింగ్‌ నుంచి కింది లొకేషన్‌ చూపిస్తూ విజువల్‌ ట్రీట్‌ని అందిస్తోంది. 

యాంకర్ శ్రీముఖి (Anchor Sreemukhi)

ఎప్పుడూ టీవీ షోస్ తో బిజీగా ఉండే శ్రీముఖి ఇప్పుడు తన వెకేషన్ ని (Sreemukhi Vacation) మస్త్ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీముఖి తన అందాలతో పాటు బూర్జ్ ఖలీఫా అందాలను కూడా ఆడియన్స్ తో షేర్ చేసుకుంది. రకరకాల లొకేషన్స్ ని షేర్ చేస్తూ వావ్ అనిపించేలా విజువల్ ట్రీట్ అందిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త ఫొటోలతో సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది  శ్రీముఖి. 

కాగా, శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెరపై జాతిరత్నాలు, సరిగమప వంటి షోస్ కి హోస్ట్ గా చేస్తోంది. మొన్నటివరకు మా టీవీలో కామెడీ స్టార్స్ (Comedy Stars) షోకి యాంకరింగ్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె ప్లేస్ లో దీపికా పిల్లి అనే మరో హాట్ యాంకర్ వచ్చి చేరింది. శ్రీముఖి బుల్లితెరపైనే కాదు సినిమాల్లోనూ అప్పుడప్పుడూ మెరుస్తూ ఉంటుంది. అంతకుముందు నితిన్ మూవీ మాస్ట్రోలో కనిపించి సందడి చేసిన ఈ బ్యూటీ... ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా భోళా శంకర్ లో నటించబోతోంది. అయితే ఓవైపు టీవీ షోస్, మూవీస్ తో మరో పక్క వెకేషన్స్ తో ఫుల్ బిజీగా  ఉంది ఈ బొద్దు బేబీ. 

 

మొదట సినీ నటిగా శ్రీముఖి.. తెలుగు ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. (Allu Arjun) అల్లు అర్జున్ జులాయి సినిమాలో ఆమె హీరో సిస్టర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆమె నటిగా పలు రకాల విభిన్నమైన సినిమాలు చేసింది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడమే కాకుండా లీడ్ రోల్స్ కూడా చేసింది. కానీ ఆ రూట్లో ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదు. యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు శ్రీముఖికి మొదట్లో కొన్ని మంచి ఆఫర్స్ వచ్చాయి. 

Read More: Anchor Sreemukhi: శ్రీముఖి పార్టీ చేసుకుంటే ఆ కిక్కే వేరు.. ఆ మత్తే వేరు !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!