Anchor Sreemukhi: శ్రీముఖి పార్టీ చేసుకుంటే ఆ కిక్కే వేరు.. ఆ మత్తే వేరు !

Updated on Jun 04, 2022 02:27 PM IST
యాంక‌ర్ శ్రీముఖి (Anchor Sreemukhi)
యాంక‌ర్ శ్రీముఖి (Anchor Sreemukhi)

బుల్లితెర హాట్ యాంక‌ర్ శ్రీముఖి (Anchor Sreemukhi) సోషల్‌ మీడియాలో చేసే రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. ఆమె టీవీ షోల‌లో కూడా దుమ్ముదుమారం లేపుతుంటుంది. ఇక ఇంటర్నెట్‌లో మాత్రం మరింతగా రెచ్చిపోతోందని అంటున్నారు నెటిజన్లు. యాంకర్‌ శ్రీముఖి  టీవీ షోస్‌లో మరింత‌ సందడి చేస్తుంటుంది. ఓ వైపు `సరిగమప సింగింగ్ షో`, మరోవైపు `జాతిరత్నాలు` కామెడీ షోస్‌తో రచ్చ చేస్తోంది. 

ఇక‌, యాంకర్‌గా ఆమె స్టేజ్‌పై చేసే హంగామా మామూలుగా ఉండదు. త‌న అందంతో ఆద్యంతం కట్టిపడేస్తుంది. చలాకీతనంతో, స్పాంటేనియస్‌ పంచ్‌లతో, అద్భుతమైన డ్యాన్సులతో శ్రీముఖి సందడి మామూలుగా ఉండదు. అయితే, తాజాగా ఓ నైట్‌ పార్టీలో రెచ్చిపోయింది శ్రీముఖి (Sreemukhi). తన ఫ్రెండ్స్ తో కలిసి నానా హంగామా చేసింది. ప్రముఖ డిజైనర్‌ కీర్తన సునీల్‌తో కలిసి, అలాగే ఇతర ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంది శ్రీముఖి. అందులో భాగంగా వీరందరూ నచ్చిన స్టఫ్ తింటూ, మందు కొడుతూ తెగ హంగామా చేశారు. 

ఇందులో, శ్రీముఖి (Sreemukhi) పొట్టి షాట్‌లో కనిపించడం విశేషం. అంత చీకట్లోనూ అందరినీ కవ్విస్తూ, కనువిందు చేసింది. మరోవైపు స్నేహితురాళ్లతో మందు కొడుతూ చిందులేసింది. అనంత‌రం కారులో రైడ్‌కెళ్లింది. అలాగే, కారులో పాటలకు వాళ్లు చేసిన హంగామా మామూలుగా లేదని చెప్పవ‌చ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
 
ఇక‌, వీకెండ్‌ జోష్‌తో హాట్‌ యాంకర్‌ శ్రీముఖి (Sreemukhi) పూర్తిగా తన పార్టీని ఆస్వాదించిందని చెప్పవచ్చు. ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఈ రాత్రిని గడిపినట్టు శ్రీముఖి తెలిపింది. అయితే అది అనుకోకుండా జరిగిందని, ప్లాన్ చేసింది కాద‌నీ, కానీ బెస్ట్ మెమరీగా నిలిచిపోతుందని డిజైనర్‌ కీర్తన సునీల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ ద్వారా వెల్లడించింది. 

 

ఈ సందర్భంగా ఆమె శ్రీముఖితో (Sreemukhi) దిగిన ఫోటోలను, పార్టీ వీడియోలను పంచుకుంది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. హాట్‌ యాంకర్‌గా పాపులర్‌ అయిన శ్రీముఖి ప్ర‌స్తుతం వరుసగా షోస్‌తో బిజీగా ఉంటోంది. జీ తెలుగు, స్టార్‌ మా, ఈటీవీ వంటి ప్రముఖ ఛానెల్స్‌లో పాపులర్‌ షోస్‌ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది శ్రీముఖి. ఆమె చేసిన ఏ షో అయినా సరే, బాగా పాపులర్‌ అవుతుండటం విశేషం. ఆ సక్సెస్‌లో తన పాత్ర కీలకంగా ఉంటుంది. 

మరోవైపు శ్రీముఖి (Sreemukhi) వెండితెరపై కూడా మెప్పించేందుకు ప్రయత్నిస్తుందీ. అడపాదడపా సినిమాలు సైతం చేస్తోంది. ఆ మధ్య `క్రేజీ అంకుల్స్` అనే చిత్రంలోనూ నటించింది. కానీ ఆ సినిమా అంతగా మెప్పించలేదు. మరోవైపు నితిన్ సినిమా `మ్యాస్ట్రో`లోనూ కీలక పాత్రలో కామెడీని పండించింది. ఇప్పుడు చిరంజీవితో `భోళాశంకర్‌` చిత్రంలో నటిస్తోంది. ఇలా ఈ భామ‌ అటు వెండితెరని, ఇటు బుల్లితెరని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతోంది. 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!