Anchor Sreemukhi: రెస్టారెంట్ ఓపెనింగ్ లో యాంకర్ శ్రీముఖి.. చికెన్ పీసులతో పోజులు!

Updated on Jun 08, 2022 01:30 PM IST
యాంకర్ శ్రీముఖి (Anchor Sreemukhi)
యాంకర్ శ్రీముఖి (Anchor Sreemukhi)

Anchor Sreemukhi: తెలుగు బుల్లితెరపై ఎనర్జిటిక్ యాంకర్ గా, రాములమ్మగా గుర్తింపు సొంతం చేసుకుంది శ్రీముఖి. టాప్ యాంక‌ర్స్‌లో శ్రీముఖి త‌ప్ప‌క ఉంటుంది. అందంతో కూడా అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది శ్రీముఖి. ఎలాంటి షోలో అయినా తన కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతోంది. అయితే, బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఈ షో తో ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.  

అయితే, శ్రీముఖి గత ఏడాది 'క్రేజీ అంకుల్స్' (Crazy Uncles)అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.  అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. 

వ‌రుస‌గా హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో రెచ్చిపోతోంది. ఇటీవ‌ల కాలంలో ఆమె క్లీవేజ్ షోలు, హాట్ ఫొటో షూట్ల‌తో మ‌రింత రెచ్చిపోతూ బాబోయ్ శ్రీముఖి అనేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. బిగ్ బాస్ షోతో (Biggboss Telugu) శ్రీముఖికి మంచి పాపులారిటీ ద‌క్కింది. శ్రీముఖి క్రేజీ సెలెబ్రిటీ కావడంతో అప్పుడప్పుడూ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో కూడా మెరుస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి ‘AB’s’ అనే రెస్టారెంట్ ఓపెనింగ్ లో పాల్గొంది. బంజారాహిల్స్ లో ఈ రెసారెంట్ ని ఓపెన్ చేశారు. అందమైన గౌనులో మెరిసిన శ్రీముఖి రెస్టారెంట్ ఓపెనింగ్ లో గ్లామర్ అట్రాక్షన్ గా నిలిచింది.

యాంకర్ శ్రీముఖి (Anchor Sreemukhi)

హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఈ రెస్టారెంట్ ని ఓపెన్ చేశారు. అందమైన గౌనులో మెరిసిన శ్రీముఖి (Anchor Sreemukhi) రెస్టారెంట్ ఓపెనింగ్ లో గ్లామర్ అట్రాక్షన్ గా నిలిచింది. చేతిలో రెస్టారెంట్ వంటకాలు పట్టుకుని ఫోజులు ఇచ్చింది. గ్రిల్ చికెన్ తో శ్రీముఖి ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఒకవైపు ఊరించే శ్రీముఖి అందాలు.. మరోవైపు నోరూరించే చికెన్ పీసులు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తి చోట త‌న అందాల ర‌చ్చ‌తో దుమ్ము రేపుతూనే ఉంది. 

ప్రస్తుతం పలు షోలకు హోస్ట్‌గా చేస్తోన్న శ్రీముఖి ఒక్కో షోకి రూ.1.5 నుంచి రూ.2లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'భోళా శంకర్' (Bhola Shankar) మూవీలో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ సినిమా దర్శకుడు. అయితే ఈ సినిమాలో శ్రీముఖి రోల్ ఏంటనేది ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది.   

Read More: Varshini sounderajan: ప‌ర‌వాల విందును పంచుతోన్న హాట్ యాంక‌ర్ వ‌ర్షిణి.. ఫొటోలు వైర‌ల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!