Jabardasth: 'కామెడీ స్టార్స్' కు తగ్గిన రేటింగ్.. త్వరలో మూసుకోవాల్సిందేనా?
తెలుగు బుల్లితెరపై దశాబ్దకాలంగా కొనసాగుతున్న కామెడీ షో జబర్దస్త్ (Jabardasth). ఈ జబర్దస్త్ కార్యక్రమాన్ని బీట్ చేయాలని చాలా ఛానెల్స్ అనేక రకాలుగా ప్రయత్నం చేశాయి. అయినా కూడా ఆ కామెడీ షో ఇప్పటికి కూడా నెంబర్ వన్ తెలుగు కామెడీ షో గా కొనసాగుతుంది. అయినప్పటికీ ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కామెడీ తరహా షోలతో బీట్ చేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఏ ఒక్కటి కూడా సఫలం కావడం లేదు. కామెడీ షో, అదిరింది లాంటి షోలు జబర్దస్త్ ను బీట్ చేయాలని అప్పట్లో పోటీ పడ్డాయి. అయితే, వెనక్కినెట్టడం చేయడం సంగతి పక్కన పెడితే ఆ షోలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. మా టీవీ ఛానెల్ వారు జబర్దస్త్ కి పోటీగా ఇటీవల కామెడీ స్టార్స్ ను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. జబర్దస్త్ జడ్జ్ నాగబాబు, ఢీ జడ్జ్ పూర్ణ లు జడ్జ్ లుగా.. జబర్దస్త్ మాజీ కమెడియన్స్ అయిన ధనరాజ్, వేణు, అవినాష్, ఆర్ పి, అప్పారావు, అదిరే అభి ఇంకా తదితర జబర్దస్త్ కమెడియన్స్ తో నే స్టార్ మా కామెడీ స్టార్స్ ను నిర్వహిస్తూ ఉంది.
అయితే, ఈ షో మొదటి ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జబర్దస్త్ (Jabardasth) రేంజ్ లోనే కామెడీ స్కిట్స్ ఉన్నాయంటూ అభిమానులు, ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ రేటింగ్ ప్రకారం చూస్తూ మాత్రం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి 5 నుంచి 6 రేటింగ్ వస్తే.. స్టార్ మా లో ప్రసారమైన కామెడీ స్టార్స్ కు మాత్రం కేవలం 2 రేటింగే వచ్చింది. అయితే, ఇంతకు ముందు తో పోలిస్తే కామెడీ స్టార్స్ రేటింగ్ కాస్త మెరుగ్గా ఉందనే అనుకోవాలి. కానీ 2 రేటింగ్ తో ఆ స్థాయిలో కామెడీ షో ను నడపడం అంటే కాస్త కష్టమే. ఇదే అభిప్రాయాన్ని విశ్లేషకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ కు, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు షోలకు వచ్చే రేటింగ్ తో పోలిస్తే కామెడీ స్టార్స్ రేటింగ్ అత్యంత తక్కువ కాబట్టి స్టార్ మా ఏ సమయంలోనైనా ఆ కామెడీ షో ఆపివేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ కామెడీ స్టార్స్ (Comedy Stars) షోని అనేక విధాలుగా మార్పులు చేర్పులు చేసినప్పటికీ జబర్దస్త్ షోని బీట్ చేయలేకపోయారు నిర్వాహకులు. అంతేకాకుండా ఈ కామెడీ స్టార్స్ షోలో మాజీ జబర్దస్త్ జడ్జ్ నాగబాబు కూడా కూర్చోబెట్టారు. అయినా కూడా ఈ షో జబర్దస్త్ కి వస్తున్న రేటింగ్ లో కనీసం సగం రేటింగ్ కూడా సంపాదించలేకపోయింది. దీంతో జడ్జి నాగబాబు తో పాటు కామెడీ స్టార్స్ లో ఉన్న అన్ని టీంలు కూడా దిగులు చెందుతున్నాయి. మామూలుగా అయితే స్టార్ మా ఛానెల్లో ఏషో అయినా 5-7 వారాలు చూసి రేటింగ్ రాకపోతే మూసివేయడం చేస్తూ ఉంటారు. కానీ కామెడీ స్టార్స్ షోకు మాత్రం ఇప్పటికే ఎక్కువగా ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చాలా వారాలుగా కామెడీ స్టార్స్ షోని కొనసాగిస్తున్నటికీ రేటింగ్ మాత్రం పెరగడం లేదు. దీంతో స్టార్ మా యాజమాన్యం కామెడీ స్టార్స్ షో నిర్వాహకులకు మరో ఆరు వారాలు గడువు ఇచ్చారట. ఆరు వారాల తర్వాత రేటింగ్ మెరుగై డబ్బులు భారీగా వస్తేనే కొనసాగించడం లేకపోతే లేదంటూ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారట. దీంతో జడ్జ్ నాగబాబు కూడా ఈ విషయంలో ఏమి చేయలేని దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
ఇదిలా ఉంటే.. కామెడీ స్టార్స్ షోకు (Comedy Stars) అతి తక్కువ రేటింగ్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ షో టెలికాస్ట్ అయ్యే టైం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షో ప్రైమ్ టైం లో అంటే రాత్రి 9:30 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. కానీ కామెడీ స్టార్స్ షో ఆదివారం మధ్యాహ్నం సమయంలో టెలికాస్ట్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం అయితే పర్లేదు కానీ మధ్యాహ్నం సమయంలో జనాలు టీవీల ముందు కూర్చుంటారంటే అది పొరపాటే అవుతుంది. బుల్లి తెర విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కామెడీ స్టార్స్ ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ చేస్తే ఖచ్చితంగా మంచి రేటింగ్ వస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. ప్రేక్షకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయమై స్టార్ మా వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి ఈ ఆరు వారాలలో రేటింగ్ వచ్చి ఈ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుందా? లేకపోతే ఫ్లాప్ అవుతుందా అనేది వేచిచూడాల్సిందే.