Varshini sounderajan: ప‌ర‌వాల విందును పంచుతోన్న హాట్ యాంక‌ర్ వ‌ర్షిణి.. ఫొటోలు వైర‌ల్!

Updated on May 29, 2022 06:08 PM IST
యాంకర్ వర్షిణి (Anchor Varshini)
యాంకర్ వర్షిణి (Anchor Varshini)

తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే మంచి గుర్తింపు సొంతం చేసుకుని.. స్టార్ యాంకర్లుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ వర్షిణి సౌందరాజన్ (varshini sounderajan) ఒకరు.  ‘శంభో శివ శంభో’ ‘లవర్స్’ ‘కాయ్ రాజా కాయ్’ ‘నన్ను దోచుకుందువటే’ ‘జోడి’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది. కానీ అటు తర్వాత ‘పెళ్లి గోల’ వెబ్ సిరీస్ క్లిక్ అవ్వడం, ‘ఢీ’ వంటి షోలతో కూడా ఈమె బాగా పాపులర్ అవ్వడంతో ఇక్కడే సెటిల్ అయిపోయింది.  అయితే ‘పటాస్2’ ‘ఢీ’ వంటి షోలు ఈమె క్రేజ్ ను డబుల్ చేశాయనే చెప్పాలి. అవ్వడానికి తమిళమ్మాయే అయినప్పటికీ.. తెలుగులో ఈ అమ్మడు బాగా క్లిక్ అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా షోలతో బిజీగా గడుపుతోంది. 

యాంకర్ వర్షిణి (Anchor Varshini) బుల్లితెర పైనే కాదు వెండితెర పై కూడా మెరిసిన సంగతి తెలిసిందే. బుల్లితెర పై వరుస షోలలో పాల్గొంటూనే మరో పక్క సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంటుంది ఈ అమ్మడు. ఈమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాకి 1.8 మిలియన్లకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను ఈమె షేర్ చేస్తూనే వస్తుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లామర్ షో విషయంలో కూడా ఈ అమ్మడు అస్సలు తగ్గదు అన్న విషయాన్ని ఆల్రెడీ ప్రూవ్ చేసింది. అనసూయ, రష్మీలను.. మించి ఈ అమ్మడు గ్లామర్ షో చేస్తుంటుంది. ఒకానొక టైంలో ఫ్యాన్స్ కు బికినీ ట్రీట్ కూడా ఇచ్చింది.

యాంకర్ వర్షిణి (Anchor Varshini)

మోడల్‌గా ఫుల్ పాపులారిటీ ఉన్న‌ప్పుడే వర్షిణి 'చందమామ కథలు' అనే తెలుగు (Tollywood) సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల‌లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, గుర్తింపును కానీ అందించలేదు. దీంతో వర్షిణి సినిమాల నుంచి కాస్త‌ గ్యాప్ తీసుకుంది. ఈ క్రమంలోనే 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌ చేసి కెరీర్‌లో తొలి సక్సెస్‌ను దక్కించుకుంది. కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసినా వర్షిణికి రావాల్సిన గుర్తింపు రాలేదు. 

దీంతో ఆమె కెరీర్ ముగిసిపోయింద‌ని అంతా అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ బ్యూటీ బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ఈటీవీ లో ప్రసార‌మ‌య్యే డ్యాన్స్ షో 'ఢీ' (Dhee Show) లో మెంటర్‌గా సందడి చేసి మ‌రింత‌ పాపులర్ అయింది. తర్వాత యాంకర్‌గా మారి 'పటాస్' సహా ఎన్నో షోలను హోస్ట్ చేసేసింది. యాంకర్‌గా మారిన తర్వాత చాలా కాలం పాటు ఎన్నో రకాల షోలను చేసిన వర్షిణి సౌందరాజన్.. ఆ మధ్య స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయిన 'కామెడీ స్టార్స్' షో తర్వాత గ్యాప్ తీసుకుంది. అనంత‌రం సమంత నటిస్తోన్న 'శాకుంతలం', సుమంత్ 'మళ్లీ మొదలైంది' వంటి సినిమాలు చేసింది. మరికొన్ని సినిమాల్లోనూ నటిస్తూ వర్షిణి సినీ కెరీర్‌ను ముందుకు తీసుకువెళ్తోంది.

యాంకర్ వర్షిణి (Anchor Varshini)

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ (Social Media) ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ రోజూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను త‌న‌ ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఫలితంగా తన ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంటోంది. చాలా కాలంగా సోషల్ మీడియాలో యమ సందడి చేస్తోన్న యాంకర్ వర్షిణి సౌందరాజన్.. అప్పుడప్పుడూ తన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటుంది. 

అయితే, ఆ ఫొటోల్లో ఎక్కువగా ఆమె అందాలను ఆరబోస్తూ దిగినవే కనిపిస్తున్నాయి. గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తున్న ఈ భామ.. తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రాళ్లను మాయ చేస్తోంది. ఇలా వర్షిణి త‌న ఫొటోల‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది. బబ్లీ యాంకర్‌ వర్షిణి సౌందరాజన్ (varshini sounderajan) తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె బుల్లి గౌను వేసుకుని క్లీవేజ్ అందాలను చూపిస్తూ ఫోజులిచ్చింది. అలాగే, తొడల వరకూ కనిపించేలా ఘాటుగా దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!