Jabardasth Vinodini: తండ్రైన లేడీ గెటప్ స్పెష‌లిస్ట్.. జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ వినోద్!

Updated on Jun 02, 2022 05:11 PM IST
జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ వినోద్ (Jabardasth Comedian Vinod)
జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ వినోద్ (Jabardasth Comedian Vinod)

Jabardasth Vinod: బుల్లితెర‌పై ప్ర‌సార‌మ‌య్యే 'జబర్దస్త్' కామెడీ షోలో లేడీ గెటప్‌లు వేసే క‌మెడియ‌న్లు ఎంతగా పాపులర్ అయ్యారో తెలిసిందే. అందులో జబర్దస్త్ వినోదిని కూడా ఎంతో పాపులర్‌. లేడీ గెటప్ వేయడం అంటే అంత ఈజీ కాదు.. మగతనాన్ని పక్కనపెట్టి మూతిమీద‌ మీసం తీసేసి.. వేషం కట్టడం అంటే పెద్ద సాహసమే. ఏదో ఒక్కసారి అంటే పర్లేదు.. అదే ఆడవేషాన్ని జీవితంగా మార్చుకుని ‘జబర్దస్త్’ (Jabardasth) వినోదాన్ని పంచుతూ ఉన్నాడు వినోద్.. అలియాస్ వినోదిని. ఆడ వేషం వేసి.. వేసి.. అసలు వీడు మగాడేనా? అనే అవమానాలు.. ఛీత్కారాలు ఎదుర్కొన్నాడు. 

వినోద్ ఒక్కడే కాదు.. జబర్దస్త్‌లో (Jabardasth) లేడీ గెటప్ వేసే చాలామంది న‌టులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రేక్ష‌కుల‌ను నవ్వించే వాళ్లు.. త‌మ‌ బతుకుల్ని నవ్వులు పాలు చేసే మాటల్ని భరించారు.. ఇప్ప‌టికీ భరిస్తూనే ఉన్నారు ఈ లేడీ గెటప్ కమెడియన్లు. ఇలాంటి వాళ్లకి పిల్లని ఇస్తారా? అసలు పిల్లల్ని కంటారా? అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. పైగా జబర్దస్త్‌లో లేడీ గెటప్‌లు వేసిన వాళ్లు కొంత‌మంది ట్రాన్స్ జెండర్స్‌గా మారడంతో ఈ అనుమానాలు మ‌రింత‌ బలపడ్డాయి. అయితే వీటన్నింటినీ దాటుకుంటూ.. అవమానాలను భరిస్తూ.. మేమూ మీలాంటి మనుషులమే.. మాకూ భార్య పిల్లలు ఉన్నారంటూ పలు సందర్భాల్లో ఎమోషనల్ అయ్యారు జబర్దస్త్‌లో లేడీ గెటప్‌లు వేసే కమెడియన్లు. 

ఈటీవీలో ప్రసార‌మ‌య్యే ఈ 'జబర్దస్త్' షో ఎంతో మందికి లైఫ్‌నిచ్చింది. ఎంతో మంది సెలబ్రిటీలయ్యారు. ఇందులో రాణించిన ఆర్టిస్టులకు పెద్ద‌పెద్ద‌ సినిమా అవకాశాలు వ‌చ్చిప‌డ్డాయి. కొందరిని ఈ షో హీరోలను కూడా చేసింది. అంతగా గుర్తింపు పొందిన ఈ షోలో లేడీ గెటప్‌తో నెంబర్‌ వన్‌ పొజిషియన్‌లో ఉన్నాడు జబర్దస్త్ వినోదిని(Jabardasth Vinodini). అలియాస్‌ వినోద్‌. అవకాశం కోసం లేడీ గెటప్‌ వేసిన వినోద్‌.. వినోదినిగా ఇంటిళ్లిపాదినీ తన కామెడీతో అలరిస్తూ.. ఆకట్టుకుంటున్నాడు. అతని కట్టు బొట్టు అచ్చం అమ్మాయిలాగే ఉండటంతో, ఎంతమంది లేడీ గెటప్‌లు ఉన్నా వినోద్ లేడీ గెటప్ వేస్తే అమ్మాయిగా పరకాయ ప్రవేశం చేసేస్తాడు. 

ఇప్పటికీ చాలామంది వినోదిని అబ్బాయా? అనే వాళ్లు చాలామంది ఉన్నారు. అంతలా లేడీ గెటప్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు వినోద్. తెలుగు టీవీ ఆడియెన్స్ కి వినోదాన్ని పంచుతున్నాడు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా అభిమానులు గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. అయితే, అవకాశాల కోసమే గెటప్‌ మార్చిన వినోద్‌.. ఇప్పుడు తండ్రి అయ్యాడు. తాను తండ్రైన విషయాన్ని ఆయ‌నే వెల్లడించారు. తాజాగా ఆయన తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ఈ విషయాన్ని పేర్కొన్నారు. అందులో తమకు పండంటి ఆడబిడ్డ పుట్టిందని.. చాలా సంతోషంగా ఉందని ప్రకటించాడు వినోద్‌. అంతేకాదు, తన చిన్నారి ఫోటో షూట్‌ పిక్స్ ని కూడా వీడియో ద్వారా పంచుకున్నాడు. దీంతో ప్ర‌స్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఎంతో క్యూట్‌గా ఉన్న చిన్నారి ముద్దొస్తోంది. దీంతో వినోద్‌(వినోదిని) అభిమానులు ఆయనకు విషెస్‌ తెలియజేస్తున్నారు. మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ఈ వీడియోలో పాప, తల్లి చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు జ‌బ‌ర్ద‌స్త్ వినోదిని.

కాగా, గతేడాది లాక్ డౌన్ స‌మ‌యంలో జబర్దస్త్ వినోద్ పెళ్లి నిరాడంబరంగా జరిగింది. కడప జిల్లాకి చెందిన తన మేనత్త కూతురు విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు వినోద్. కాగా ఇటీవల వినోద్ ఓ ఇంటి విషయంలో వార్తల్లో నిలిచాడు. ఇంటి ఓనర్ దాడితో తీవ్రంగా గాయపడ్డ జబర్దస్త్ కమెడియన్ వినోద్‌ (వినోదిని) తనకు ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇంటి ఓనర్ దాడిలో తీవ్ర గాయాల పాలయ్యాడు వినోద్. అయితే, ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే క్యాష్‌ ప్రోగ్రామ్‌లో ఏకంగా తన భార్య సీమంతం చేయించారు. షో యాంక‌ర్ సుమ సమక్షంలో వినోద్ భార్య సీమంతం జరగడం విశేషం. ఈ సందర్బంగా వినోద్‌ ఎమోషనల్‌ అయ్యారు. తనకు అమ్మలేదని, నా భార్య‌ తనని నమ్ముకుని ఉందని, తనకు బ్యాక్‌బోన్ గా నిలిచిందని భార్య గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు వినోద్‌. ఇప్పుడు ఆమె పండంటి ఆడబిడ్డకి జన్మనివ్వడం విశేషం. 

Readmore: Jabardasth: 'కామెడీ స్టార్స్' కు త‌గ్గిన రేటింగ్.. త్వ‌ర‌లో మూసుకోవాల్సిందేనా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!