Jabardasth: జ‌బ‌ర్దస్త్ గురించి హీరో వెంక‌టేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారంటున్న‌ అదిరే అభి!

Updated on May 28, 2022 11:45 PM IST
జ‌బ‌ర్దస్త్, హీరో వెంక‌టేష్ (Jabardasth, Hero Venkatesh)
జ‌బ‌ర్దస్త్, హీరో వెంక‌టేష్ (Jabardasth, Hero Venkatesh)

ప్రస్తుతం బుల్లితెర‌పై ప్ర‌సార‌మ‌వుతున్న కామెడీ షోలు (Jabardasth) జబర్దస్త్, కామెడీ స్టార్స్. ఇవేకాకుండా మరికొన్ని కామెడీ షోలు వివిధ ఛానెళ్ల‌లో ఎప్ప‌టినుంచో ప్ర‌సార‌మ‌వుతున్నాయి. వీటి ద్వారా ఎంతో మంది క‌మెడియ‌న్స్ మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. అలాంటి వాళ్లలో అదిరే అభి ఒకరు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదిరే అభి మాట్లాడుతూ ప‌లు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 'లాక్ డౌన్ సమయంలో జనాలకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌‌లు ఎక్కువగా అలవాట‌యిపోయాయ‌ని' అదిరే అభి చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన‌ 'బాహుబ‌లి' సినిమా కోసం ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దగ్గర తాను పని చేశాన‌ని గుర్తుచేశారు. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం తాను పని చేయలేదని ఆయన అన్నారు. తనకు కొత్త విషయాలు నేర్చుకోవడమంటే ఆసక్తి అని ఆయన చెప్పుకొచ్చారు. 

అంతేకాకుండా.. యూట్యూబ్ ద్వారా తాను తమిళం నేర్చుకున్నానని తెలిపారు. అలాగే ద‌ర్శ‌కుడు రాజమౌళి (SS Rajamouli) తనను ఎంతగానో సపోర్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ అనుష్క చాలా స్వీట్ పర్సన్స్ అని అదిరే అభి అభిప్రాయపడ్డారు.

కాగా,  ప్రభాస్‌తో మాట్లాడేట‌పుడు త‌మ‌ ఇంటరాక్షన్ చాలా ఫన్నీగా ఉండేదని ఆయన గత విషయాలను నెమరువేసుకున్నారు. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. తాను రెమ్యునరేషన్ గురించి పెద్దగా పట్టించుకోనంటూ చెప్పుకొచ్చారు. 'నాకు డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు.. సాఫ్ట్ వేర్‌లో నాకు మంచి జాబ్ ఆఫర్లు ఉన్నాయి' అని ఆయన తెలిపారు. అయితే, డబ్బుల కోసం సినిమాల‌ను వదిలిపెట్టిన సందర్భాలు మాత్రం త‌న కెరీర్‌లో లేవని ఆయన తెలిపారు.

అలాగే, సినిమా ఆఫర్ కావాలని వెళితే చాలా హీనంగా మాట్లాడే మేనేజర్లు చాలామంది ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే 'ఒకాయ‌న ఓ సారి నన్ను గుర్తు పట్టని విధంగా ప్రవర్తించారు. దీంతో నేను అదిరే అభి అని పరిచయం చేసుకున్నాను. అప్పడు  తాను టీవీ చూడనని అవతలి వ్యక్తి చెప్పాడు.  అనంత‌రం అదే వ్యక్తి జబర్దస్త్ లో జ‌డ్జెస్ రోజా, నాగబాబు (Mega Brother Nagababu) నిజంగా నవ్వుతారా అని అడిగాడు, అస‌లు టీవీనే చూడని వ్యక్తికి అది ఎలా తెలిసింది.. దీంతో ఆ వ్యక్తి కావాలనే ఇదంతా చేస్తున్నాడనే విషయం నాకు అర్థమైంది. ఇక టాలీవుడ్ హీరో విక్ట‌రీ వెంకటేష్ గారు మాత్రం కలిసిన రెండు మూడు సందర్భాల్లోనే బాగా రిసీవ్ చేసుకున్నారు. జబర్దస్త్‌లో కామెడీ భలే చేస్తారని మెచ్చుకున్నారు' అని అదిరే అభి తెలిపారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!