ఢీ స్టేజీపై వెక్కి వెక్కి ఏడ్చిన ప్రియమణి (Priyamani).. కారణం ఏంటంటే?
హీరోయిన్, జాతీయ ఉత్తమ నటి విన్నర్ ప్రియమణి (Priyamani) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో ఎన్నో హిట్లతో ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది ఈ భామ. ఒకానొక సమయం లో స్టార్ హీరోయిన్ గానూ హవా నడిపించింది.
ఈ బ్యూటీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటించిన యమదొంగ సినిమాతో టాలీవుడ్ (Tollywood) లో హీరోయిన్ గా అందరికీ సుపరిచితురాలు గా మారియింది. ఇక, ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అనంతరం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనా.. ఇటీవల విక్టర్ వెంకటేష్ సరసన నారప్ప సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. దీంతో మళ్లీ ఆమెకు సినిమా అవకాశాలు తలుపుతడుతున్నాయి.
ఇదే క్రమంలో బుల్లితెర ప్రేక్షకుల కూడా దగ్గరయ్యేందుకు ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ కార్యక్రమం లో జడ్జిగా చేస్తోంది. ఇందులో భాగంగానే వచ్చేవారం ఢీ షో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ లో ప్రియమణి బయోపిక్ ని డ్యాన్స్ పర్ఫామెన్స్ రూపంలో చేసి చూపించారు.
దీంతో ఈ పర్ఫామెన్స్ ప్రియమణికి ఎంతగానో కనెక్ట్ అయి పోయింది. ఇక పర్ఫామెన్స్ పూర్తయిన అనంతరం ఆ పర్ఫామెన్స్ చేసిన గ్రూపు వారు ఆమెను స్టేజి మీదికి పిలిచ ఒక గిఫ్టు ఇచ్చారు. ప్రియమణి ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి ఫోటో చూసి షాక్ తో ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుంటుంది. దీంతో అభిమానులు అందరూ కూడా షాక్ అయ్యారు. ప్రియమణి ని అంతగా ఏడ్పించేసిన ఆ ప్రోమోను మీరూ చూసేయండి.