Hyper Aadi & Varshini: బుల్లితెర సెలబ్రిటీలు హైపర్ ఆది, వర్షిణి ప్రేమలో ఉన్నారా.. ఆ పోస్ట్‌కు అర్థమేంటి?

Updated on Jun 12, 2022 02:11 PM IST
హైపర్ ఆది, యాంకర్ వర్షిణి (Hyper Adi, Anchor Varshini)
హైపర్ ఆది, యాంకర్ వర్షిణి (Hyper Adi, Anchor Varshini)

Hyper Aadi  & Varshini: బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. ఆయన  లవ్ అఫైర్ గురించిన విషయాలు వినిపించడం తక్కువే. అలాగే బుల్లితెర హాట్ యాంకర్ వర్షిణి సౌందర్ రాజన్... ఈమెది కూడా పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.

ఏంటీ.. ఇప్పుడు వీరిద్దరి ప్రస్తావన  అనుకుంటున్నారా..? తాజాగా హైపర్ ఆది, వర్షిణి ఊహించని షాక్ ఇచ్చారు. అయితే ఇది ఆన్ స్క్రీన్ పై కాదు. రియల్ లైఫ్ లో వీళ్ళిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారా అనే అనుమానాలు నెటిజన్లలో బలంగా మొదలయ్యాయి. 

వివరాల్లోకి వెళితే... ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ (Jabardasth) కామెడీ షో ఎంతో మంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చింది. అంతెందుకు..? ఎంటర్టైన్‌మెంట్‌ రంగంలో ఈటీవీ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి, ఎంతో మందిని లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చింది. అలాంటి వారిలో జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ఒకరు. టైమ్లీ పంచెస్‌తో అతి తక్కువ సమయంలోనే టీమ్‌ లీడర్‌గా ఎదిగాడు. తాను రాసుకునే స్క్రిప్ట్‌లో లైను లైనుకు ఓ పంచ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు.

అంతేకాకుండా, తన పంచ్‌లను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు కూడా. కొంత డబుల్‌ మీనింగ్‌లో ఉన్నా, హైపర్ ఆది కామెడీని జనాలు తెగ ఎంజాయ్ చేస్తారు. 

జబర్దస్త్‌లో ఒక వెలుగు వెలుగొందిన ఆదికి క్రమంగా సినిమా అవకాశాలు వచ్చాయి. అక్కడా తన నటనతో ఆకట్టుకున్నాడు ఆది. బిగ్‌స్క్రీన్‌ పై హైపర్ ఆది కనపడగానే, జనాల విజిల్స్‌తో థియేటర్ మారుమోగిపోతుంది. ఏదేమైనా, ఆది ఒక కమెడియన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఆదికి మంచి ఫేమ్ వచ్చేయడంతో.. అదే ఈటీవీలో ఢీ (Dhee Dance Show) అనే డ్యాన్స్ ప్రోగ్రాంలో టీమ్‌ లీడ్‌గా చేస్తూ. జనాలను ఎంటర్‌టెయిన్ చేస్తున్నాడు. ఇక, ఈ మధ్యకాలంలో ఆది జబర్దస్త్‌కు దూరమయ్యాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సుడిగాలి సుధీర్ జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పేసి.. మరో ఛానెల్‌లో బ్యూటీ అనసూయతో కలిసి ఓ సింగింగ్ ప్రోగ్రాంకు లీడ్ యాంకర్‌గా చేస్తున్నాడు. 

ఇదిలా ఉంటే... తాజాగా హైపర్ ఆది జన్మదిన వేడుకలు జరిగాయి. హైపర్ ఆది తన 'బర్త్ డే' ని వర్షిణితో ప్రయివేట్‌గా సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఆ వీడియోని వర్షిణి (Anchor Varshini) పోస్ట్ చేయడం అందరికీ షాకింగ్‌‌గా మారింది. ఆ వీడియోలో వర్షిణి ఆదికి కేక్ తినిపించడం.. అతడిని ప్రేమగా, రొమాంటిక్‌గా కౌగిలించుకోవడం లాంటి ఫోటోలు ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే వర్షిణి, ఆదికి ప్రపోజ్ చేస్తున్నట్లు ఉంది.

ఇక వర్షిణి ఈ వీడియోకి కామెంట్ పెడుతూ.. 'డియర్ ఆది.. హ్యాపీ బర్త్ డే. నా జీవితం మొత్తం నీవు తోడుగా ఉండాలి. నా ఫేవరెట్ పర్సన్, సపోర్ట్ సిస్టం నువ్వే. రైటర్ ఆది.. నువ్వు నాకు రైట్ రా ఆది' అంటూ వర్షిణి లవ్ ఎమోజీలు సైతం పోస్ట్ చేసింది. 

దీంతో వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. నెటిజన్లు కూడా అదే రకంగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. నీ' లాస్ట్ కామెంట్ చూస్తుంటే డౌట్ గా ఉంది. మీరిద్దరూ ప్రేమలో ఉన్నారా' అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

మరికొందరు 'వీరిద్దరి జోడి బాగుందని' కామెంట్స్ చేస్తున్నారు. ఢీ షోలో ఉన్నప్పుడు ఆది (Hyper Adi), వర్షిణి చాలా సార్లు రొమాంటిక్ డాన్స్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. మరి వీరిద్దరిది ఫ్రెండ్ షిప్ మాత్రమేనా లేక నిజంగానే ఏదైనా ఎఫైర్ లో ఉన్నారా అనేది తెలియాలంటే వారే స్పందించాలి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!