Escaype live: ఎస్కేప్ లైవ్ వెబ్ సిరీస్.. డ‌బ్బు కోసం యువ‌త త‌ప్పుదారి ప‌డుతున్నారా!

Updated on Jun 04, 2022 01:43 PM IST
'ఎస్కేప్ లైవ్' వెబ్ సిరీస్ పోస్ట‌ర్ (Escaype live Poster)
'ఎస్కేప్ లైవ్' వెబ్ సిరీస్ పోస్ట‌ర్ (Escaype live Poster)

టాలీవుడ్‌లో లవర్‌ బాయ్‌గా ముద్ర వేసుకున్న హీరో సిద్ధార్థ్ (Hero Siddarth). తెలుగులో 'బొమ్మరిల్లు'తో సూపర్‌ హిట్‌ కొట్టాడు సిద్ధార్థ్‌. ఆ సినిమాలో హ హ.. హాసినీ అంటూ, ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతూ అల్లరిచేసే సిద్ధార్థ్​ నటన అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాల్లోనూ తనదైన స్టైల్​, మానరిజమ్​తో ఆకట్టుకున్నాడు ఈ హీరో. తెలుగులో చాలా గ్యాప్‌ తర్వాత 'మహాసముద్రం' సినిమాతో అలరించాడు. అయితే, అతని నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పన‌క్కర్లేదు.

ఈమధ్య కాలంలో ఆయన సినిమాలు​ కాస్త తగ్గించినా.. వెబ్ సీరిస్‌తో తన టాలెంట్‌ను చూపించుకొనేందుకు మరో చాన్స్​ అందిపుచ్చుకున్నాడు. తాజాగా ఈ యంగ్‌ హీరో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయ‌న ఓటీటీలో తొలిసారిగా చేసిన‌ వెబ్‌ సిరీస్‌ ఎస్కేప్‌ లైవ్‌. సిద్ధార్థ్‌ కుమార్ తివారి దర్శకత్వం వహించారు. కాగా, ఈ వెబ్‌ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar) స్పెషల్స్‌ నిర్మించింది. ఇది మే 20న విడుదలైంది. 

రీల్స్‌, సోషల్‌ మీడియాతో వచ్చే డబ్బు కోసం యువత ఏం చేస్తుందనే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో 'ఎస్కేప్‌ లైవ్‌' (escaype live) వెబ్‌ సిరీస్ రూపొందింది. ఇప్పటివరకు ఎవరూ చేయని కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌లో,​ నేటి పరిస్థితులకు అనుగుణంగా చాలా దగ్గరగా సీన్స్​ ఉన్నాయి. మొన్నటి దాకా ‘టిక్ టాక్’, ‘డబ్ స్మాష్’ అంటూ టైంపాస్ చేసిన యువత.. ఇప్పుడు ‘షార్ట్స్’, ‘రీల్స్’, ‘చింగారీ’, ‘టకా టక్’ అంటూ రకరకాల వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

ఈ యాప్‌ల ద్వారానే కొందరు తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తుంటే.. మరికొందరు ఏదో ఒకటి చేసి వైరల్ కావాలనే తాపత్రయంతో దారుణమైన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. వారు చేసే వీడియోలు వైరల్ అయ్యేందుకు.. ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అలాంటి పాత్రలన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కించిన వెబ్ సీరిసే ఈ ‘ఎస్కేప్ లైవ్’. మన చుట్టుపక్కల ఉండే జీవితాలనే కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నాన్ని ఈ సిరీస్‌లో చూపించారు.

'ఎస్కేప్ లైవ్' వెబ్ సిరీస్ పోస్ట‌ర్ (Escaype live Poster)

ఇక‌, ఈ వెబ్ సిరీస్ క‌థ విష‌యానికి వ‌స్తే.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కృష్ణ స్వామి తల్లి, చెల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. ఆయ‌న‌కు తండ్రి లేకపోవడంతో కుటుంబ బాధ్యతలను త‌నే తీసుకుంటాడు. తన అర్హతకు తగిన ఉద్యోగం దొరక్కపోవడంతో 'ఎస్కేప్‌ లైవ్‌' (escaype live) అనే వీడియో షేరింగ్‌ యాప్‌లో మోడరేటర్‌గా జాయిన్‌ అవుతాడు. అయ‌తే, ఎస్కేప్‌ లైవ్‌ యాప్‌ తన పాపులారిటీని పెంచుకునేందుకు ఓ కాంటెస్ట్‌ నిర్వహిస్తుంది. యాప్ యూజర్స్‌ వివిధ రకాలుగా వీడియోలు చేసి అప్‌లోడ్‌ చేస్తే వారికి డైమండ్స్ వస్తాయి. ఆ డైమండ్స్ కాస్తా క్యాష్‌ రూపంలో వారి సొంత‌ అకౌంట్‌కు చేరతాయి.

ఈ క్రమంలో ఒక డేట్‌ వరకు, ఎక్కువ డైమండ్స్‌ గెలుచుకున్న వారికి రూ.3 కోట్లు ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటిస్తారు ఎస్కేప్‌ లైవ్‌ నిర్వాహకులు. ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్న యూజర్స్‌ ఆ డబ్బు కోసం ఎంతకు తెగిస్తారు? యాప్‌ కాన్సెప్ట్ నచ్చని కృష్ణ ఏం చేస్తాడు? ఆ సమయంలో కృష్ణ ఎదుర్కున్న పరిస్థితులు ఎంటి? అందులో పాల్గొన్న ఐదుగురు కంటెస్టెంట్‌లు చివరికి ఏమయ్యారు? ఆ రూ.3 కోట్లను ఎవరు గెలుచుకున్నారు ? అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ సిరీస్‌ను చివ‌రివ‌ర‌కు చూడాల్సిందే.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!