Bigg Boss Season 6 : లక్కీ ఛాన్స్ కొట్టేసిన యూట్యూబర్ హర్షసాయి (Harsha Sai) .. ఇందులో నిజమెంత ?

Updated on Jun 12, 2022 01:44 PM IST
యూట్యూబర్ హర్షసాయి (Youtber Harsha Sai)
యూట్యూబర్ హర్షసాయి (Youtber Harsha Sai)

Harsha Sai: ప్రస్తుతం యూట్యూబ్‌లో, ఫేస్ బుక్‌లో సోషల్ మీడియాలో ఇలా ఎక్కడ చూసినా కూడా.. యూట్యూబర్ హర్ష సాయి పేరు మార్మోగిపోతోంది. 4.99 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్స్‌తో సోషల్ మీడియా సంచలనంగా మారిన హర్ష సాయి త్వరలో బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్‌గా రాబోతున్నాడంటూ ప్రచారం మొదలైంది.

ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 6 లోగో లాంచ్ ప్రోమో విడుదల కాగా.. అందులో హర్ష సాయి గురించే చర్చ నడిచింది. 'అన్న బిగ్‌బాస్‌లోకి వస్తున్నాడని కొందరు, వచ్చి పేరు చెడగొట్టుకోవద్దని మరికొందరు' కామెంట్లతో మోత మోగించారు.

దీంతో బిగ్‌బాస్‌ ఎంట్రీపై తాజాగా హర్షసాయి స్పందించాడు. బిగ్‌బాస్‌కు (Biggboss Telugu) వచ్చే ఛాన్సే లేదని తేల్చి చెప్పాడు. తనకు స్వేచ్ఛగా ఉండటమే ఇష్టమని, అదే ముఖ్యమని నొక్కి చెప్పాడు. అందుకే యూట్యూబ్‌ వీడియోలు కూడా ప్రతివారం ఒకటి అప్‌లోడ్‌ చేయాలని నియమం పెట్టుకోకుండా.. నచ్చినప్పుడు వీడియోలు చేస్తానని చెప్పుకొచ్చాడు. 

కాగా, రియల్ లైఫ్ శ్రీమంతుడిగా గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ హర్ష సాయికి 4.99 మిలియన్ల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం అందరూ యూట్యూబ్ (Youtube) లో డబ్బులు కోసం వీడియోలు చేస్తుంటే.. హర్ష సాయి మాత్రం ఏ వీడియో చేసినా అందులో ప్రజలకు సేవ చేయడమే ప్రధాన అంశంగా పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే అతను వీడియోలు చేస్తున్నాడు. సాయం అంటే ఏదో వందో, వెయ్యో కాదు. అవసరాన్ని బట్టి లక్షల్లో సాయం చేస్తుంటాడు హర్ష సాయి. 

అలాగే పేదవాళ్లు ఊహించని రీతిలో సాయం చేసి దానకర్ణుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు హర్షసాయి (Harsha Sai). ఇప్పటికే వందల కుటుంబాలకు సాయం చేసిన హర్ష సాయి, త్వరలో మరో 1 మిలియిన్ అనగా పది లక్షలు రూపాయల డబ్బుని పేదలకు దానం చేయబోతున్నట్టు తెలిపాడు.

ఆ డబ్బుతో వంద మంది పేదలు ఇళ్లు కట్టుకొనేందుకు సాయం చేయబోతున్నట్టు తెలిపాడు హర్ష సాయి. ఎవరికైనా తన సాయం కావాలనిపిస్తే 09502600756 నెంబర్‌కి కాల్ చేయొచ్చని తన నెంబర్‌ని కూడా అందులో ఉంచాడు హర్షసాయి. 

23 ఏళ్ల హర్షసాయి ఒక్క తెలుగులోనే కాకుండా.. తమిళం, హిందీ, మలయళం, కన్నడ భాషల్లో కూడా ఛానల్స్ ఓపెన్ చేసి పాన్ ఇండియా యూట్యూబర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అన్ని భాషల్లోనూ కలిపి 12 మిలియన్లకు మందికి పైగా ఫాలోవర్స్‌ని రాబట్టి..  నెంబర్ 1 యూట్యూబర్‌గా సోషల్ మీడియాలో (Social Media) సంచలనంగా మారాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!