Jani Master: ‘యథా రాజా తథా ప్రజా’ సినిమాతో హీరోగా తెరంగ్రేటం చేయబోతున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..!

Updated on Aug 23, 2022 03:44 PM IST
కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ (Jani Master) కి మంచి పేరుంది. తెలుగు.. తమిళ సినిమాలతో కొరియోగ్రాఫర్ గా ఆయన బిజీగా ఉన్నాడు.
కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ (Jani Master) కి మంచి పేరుంది. తెలుగు.. తమిళ సినిమాలతో కొరియోగ్రాఫర్ గా ఆయన బిజీగా ఉన్నాడు.

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ (Jani Master) హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘యథా రాజా తథా ప్రజా’ (Yatha Raja Tatha Praja). తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) క్లాప్ కొట్టగా.. సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు కుమార్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. 

ఇక, ఈ సినిమాలో ‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ (Vikas) మరో హీరోగా, శ్రష్టి వర్మ (Shrasti Verma) హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీనివాస్ విట్టల దర్శకత్వంలో ఓం మూవీ క్రియేషన్స్, శ్రీ కృష్ణ మూవీ క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ విట్టల, హరీష్ పటేల్ నిర్మించనున్నారు.

కాగా, కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ (Jani Master) కి మంచి పేరుంది. తెలుగు.. తమిళ సినిమాలతో కొరియోగ్రాఫర్ గా ఆయన బిజీగా ఉన్నాడు. ప్రభుదేవా.. లారెన్స్ మాదిరిగానే ఆయన కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన లీడ్ రోల్ లో మొదటి సినిమాగా 'యథా రాజా తథా ప్రజా' సినిమా పట్టాలెక్కింది. 

'యథా రాజా తథా ప్రజా' (Yatha Raja Tatha Praja) సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జానీ మాస్టర్ మాట్లాడుతూ.. "తెలుగు సినిమాను ఒక మలుపు తిప్పిన చిరంజీవిగారి పుట్టినరోజున నా సినిమా మొదలుకావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా సినిమా ఓపెనింగ్ కి పిలవగానే శర్వానంద్ గారు వచ్చినందుకు సంతోషంగా ఉంది" అన్నాడు.  

దర్శక-నిర్మాత శ్రీనివాస్‌ విట్టల (Srinivas Vittala) మాట్లాడుతూ.. ‘పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. సెప్టెంబర్‌ 15న రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభిస్తాం’ అని అన్నారు. ‘జానీ మాస్టర్‌ అంటే డ్యాన్స్, కమర్షియల్‌ అంశాలు కాకుండా మంచి కథతో వస్తే బాగుంటుందని ‘యథా రాజా తథా ప్రజా’లో నటిస్తున్నాను. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నాం’ అన్నారు జానీ. ఇక, ఈ చిత్రానికి రథన్ సంగీతం దర్శకత్వం వహిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ గా సునోజ్‌ వేలాయుధన్‌ వ్యవహరిస్తున్నారు.

Read More: Telugu Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6 నుంచి బిగ్ సర్ ప్రైజ్.. సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం.. ప్రోమో రిలీజ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!