బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Season 6) : నామినేషన్స్ మొదలైయ్యాయి... మొదటి వారం డేంజర్ జోన్‌లో ఉన్నది వీరేనా ?

Updated on Sep 07, 2022 06:09 PM IST
మొదటివారంలో భాగంగా తాజాగా నామినేషన్స్ ప్రోమో (First Week Promo) రిలీజ్ చేశారు బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6) నిర్వాహకులు.
మొదటివారంలో భాగంగా తాజాగా నామినేషన్స్ ప్రోమో (First Week Promo) రిలీజ్ చేశారు బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6) నిర్వాహకులు.

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Season 6). ఈ షో ఎట్టకేలకు సెప్టెంబర్ 4వ తేదీన స్టార్ మా ఛానెల్‌లో సాయంత్రం 6 గంటలకు ప్రసారమైంది. ఈ  బిగ్ బాస్ గేమ్.. తొలివారం  కాస్త కొత్తగా, ఆసక్తికరంగా సాగడం విశేషం. ముఖ్యంగా నామినేషన్స్, కెప్టెన్సీ టాస్క్‌లు వైవిధ్యంగా సాగడంతో, ప్రేక్షకులు కూడా ఖుషీ అవుతున్నారు.  

గత రెండు రోజులుగా ట్రాష్.. క్లాస్.. మాస్ అంటూ సాగిన టాస్క్‌లో కంటెస్టెంట్లు పార్టిసిపేట్ చేశారు. ట్రాష్‌లో ఇంటి సభ్యులు ఒక్కొక్కరు తమ స్థానాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేశారు. కాకపోతే ఈ ఛాలెంజ్‌లో భాగంగా..  అప్పటికే క్లాసులో ఉన్న శ్రీహాన్ (Srihan) మాస్‌లోకి, అలాగే ట్రాష్‌లో ఉన్న గీతు క్లాస్‌లోకి వెళ్ళిపోయారు.

అలాగే ట్రాష్‌లోకి అభినయశ్రీ , బాలాదిత్య (Baladitya) వచ్చారు. ఇక ఫస్ట్ నుంచి ట్రాష్‌లోనే ఉన్న ఇనయ.. గేమ్ పూర్తయినా కూడా ట్రాష్ లోనే ఉండిపోయింది. గీతూ (Geetu Royal), ఆది రెడ్డి, నేహా చౌదరిలు క్లాస్, ట్రాష్ టాస్క్‌లో తమదైన శైలిలో ప్రతిభను చూపించారు. దీంతో నామినేషన్స్ నుంచి తప్పించుకుని కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు.

ఇక బాలాదిత్య, ఇనయ, అభినయ డైరెక్ట్‌గా నామినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈవారం జరిగిన నామినేషన్స్ టాస్క్ అయితే మంచి రంజుగా సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. 

తాజాగా మొదటివారం నామినేషన్స్ ప్రోమోని (First Week Promo) రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమోలో ఫస్ట్ వీక్‏లోనే హౌస్‏లో మాటల యుద్ధం నడిచినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సింగర్ రేవంత్.. జబర్ధస్త్ ఫైమా.. యాంకర్ ఆరోహి మధ్య తీవ్రస్థాయిలో ఫైట్ జరిగినట్లుగా ప్రోమో చూస్తే తెలుస్తోంది.

నామినేషన్ ప్రక్రియలో (Biggboss6 Nomination Process) భాగంగా ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటారో.. వాళ్ల పేర్లు పేపర్‌పై రాసి ఆ చీటీలను టాయిలెట్ సీట్లో వేయాలి. ఇలా ఎక్కువ ఎవరి పేర్లు టాయిలెట్ సీటులో పడతాయో, వాళ్ళే నామినేట్ అయినట్టు లెక్క. ఈ నామినేషన్స్‌లో ప్రాసెస్‌లో మొత్తం ఏడుగురు నిలిచినట్లు తెలుస్తోంది. వారిలో ముఖ్యంగా అభినయశ్రీ, ఇనాయా సుల్తానా, రేవంత్, ఫైమా, ఆరోహి రావు, శ్రీ సత్య , చంటి ఉన్నట్లు సమాచారం.

ఈ ఏడుగురిలో సింగర్ రేవంత్ (Singer Revanth) స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి.. అతను నామినేషన్స్‌లో ఉన్నా ఫరవాలేదంటున్నారు. ఆయనకు ఓట్లు కూడా బాగానే పడే అవకాశం ఉంది. ఇక కమెడియన్లు ఫైమా (Faima), చలాకీ చంటిలకు జబర్దస్త్ ఫేమ్ ఉంది. పైగా వాళ్లు హౌస్‌లో మంచి వినోదాన్ని కూడా పంచుతున్నారు. కాబట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఇక యాంకర్ ఆరోహి, అభినయ శ్రీ, ఇనయ, శ్రీ సత్య ఈ నలుగురులో ఒకరు ఈవారం ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. 

Read More: ఎక్స్‌ట్రా జబర్దస్త్ (Extra Jabardasth) : పుష్ప డైలాగ్‌తో రెచ్చిపోయిన ఫైమా.. ప్రోమో వైర‌ల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!