హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Shekhar Master) కూతురు సాహితి (Sahithi)

Updated on Aug 17, 2022 08:49 PM IST
శేఖర్ మాస్టర్ కూతురు సాహితి ప్రస్తుతం వెండితెర ఎంట్రీ (Sahiti Tollywood Entry) ఇవ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
శేఖర్ మాస్టర్ కూతురు సాహితి ప్రస్తుతం వెండితెర ఎంట్రీ (Sahiti Tollywood Entry) ఇవ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ (Shekhar Master) ఒకరు. ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల అందరితో కూడా ఈయన అద్భుతమైన స్టెప్పులు వేయించారు. చిరంజీవి , అల్లు అర్జున్ లాంటి గొప్ప డాన్సర్లు కూడా శేఖర్ మాస్టర్ డాన్స్ ను తెగ పొగుడుతూ ఉంటారు. ఒకవైపు వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూనే, మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తూ బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. 

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కి సాహితీ (Sahithi Shekar), విన్ని(Vinni) అనే ఇద్దరు పిల్లలు. వీరు కూడా మంచి డ్యాన్సర్లు. గతంలో పలు షోల్లో అదిరిపోయే డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. వీరిద్దరూ యూట్యూబ్ వీడియోలతో ఎంతో ఫేమస్ అయ్యారు. విన్ని అయితే.. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి సందడి చేశాడు. 

శేఖర్ మాస్టర్ కూతురు సాహితి (Sahithi Shekar)

కాగా, సాహితి మాత్రం తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతోంది. ఇలా డ్యాన్స్ వీడియోలు, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సాహితి ప్రస్తుతం వెండితెర ఎంట్రీ (Sahiti Tollywood Entry) ఇవ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఒక కొత్త దర్శకుడు ఆమెకు కథ చెప్పారు అని.. శేఖర్ మాస్టర్ కూడా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని సమాచారం.

అయితే సాహితి సరసన నటించే హీరో విషయంలో శేఖర్ మాస్టర్ (Shekhar Master) కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సాహితి మొదటిసారిగా వెండితెర ఎంట్రీ ఇస్తుండడంతో కొంచెం ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోతో సినిమా చేస్తే బాగుంటుందని భావించారట శేఖర్ మాస్టర్. 

ఇందులో భాగంగానే ఇండస్ట్రీలో తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించి పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలకు కథ వినిపించి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. మరి సాహితి (Sahithi Shekar) సరసన హీరోగా నటించే ఆ యంగ్ హీరో ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Read More: Aanasuya bharadwaj: జబర్దస్త్ (Jabardasth) కామెడీ షోకు హాట్ యాంకర్ అనసూయ గుడ్ బై.. కొత్త యాంకర్ ఎవరంటే?

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!