Lucky Lakshman: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ (Syed Sohel Ryan) నటించిన ”లక్కీ లక్ష్మణ్” నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్..!

Updated on Aug 06, 2022 02:21 PM IST
”లక్కీ లక్ష్మణ్” (Lucky Lakshman) సినిమాలోని 'అదృష్టం హలో అంది రో.. చందమామ' లిరికల్ వీడియో సాంగ్‌ను డైరెక్టర్ శివ నిర్వాణ రిలీజ్ చేశారు.
”లక్కీ లక్ష్మణ్” (Lucky Lakshman) సినిమాలోని 'అదృష్టం హలో అంది రో.. చందమామ' లిరికల్ వీడియో సాంగ్‌ను డైరెక్టర్ శివ నిర్వాణ రిలీజ్ చేశారు.

బిగ్ బాస్ సీజన్ 4 (Biggboss 4) ఫేమ్ సోహైల్ హీరోగా దత్తాత్రేయ మీడియా పతాకంపై రూపొందిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’.  సోహైల్‌కు జంటగా ఈ చిత్రంలో హీరోయిన్‌ మోక్ష నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్బంగా ఈ సినిమాలోని 'అదృష్టం హలో అంది రో.. చందమామ' టైటిల్ లిరికల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ పాటను మజిలీ, ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ (Shiva Nirvana) విడుదల చేయడం విశేషం. కథానాయకుడు రాత్రికి రాత్రే ధనవంతుడు అవుతాడనే కాన్సెప్ట్ చుట్టూ ఈ పాట తిరుగుతుంది.  

ప్రముఖ రచయిత భాస్కరపట్ల (Bhaskarabatla) రాసిన ఈ గీతాన్ని సింగర్ 'రామ్ మిరియాల ' చ‌క్క‌గా ఆలపించారు. ఇక, ఈ పాటకు విశాల్ అందించిన కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇక డీఓపీ ఆండ్రు చక్కటి విజువల్స్ ఇచ్చాడు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ పాటలకు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రంలోని పాటలు కూడా ఆడియెన్స్‌ను మెస్మ‌రైజ్ చేస్తాయని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ సందర్బంగా శివ నిర్వాణ మాట్లాడుతూ..”లక్కీ లక్ష్మణ్” (Lucky Lakshman) లోని ఈ టైటిల్ సాంగ్ చాలా బాగుంది. ఈ చిత్ర దర్శకుడు ఏ ఆర్.అభి , నిర్మాత హరిత గోగినేనిలకు ఇది మొదటి చిత్రమైనా, చాలా చక్కగా తెరకెక్కించారు. వీరిద్దరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి. నటుడు సోహైల్ నటన బాగుంటుంది. ఇందులో తన డ్యాన్స్ చూడముచ్చటగా ఉంది. వీరి ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం, గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ' అన్నారు.

అనంతరం చిత్ర హీరో సొహైల్ (Sohel Ryan) మాట్లాడుతూ… “దర్శకులు శివ నిర్వాణ గారు ఎంత బిజీగా ఉన్నా, మా ”లక్కీ లక్ష్మణ్” టైటిల్ సాంగ్ వీడియోను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా దర్శకులు ఏ ఆర్. అభి , నిర్మాత హరిత గోగినేనిలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో.. సినిమా కథలను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారు.

ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ అవుట్‌పుట్ పరంగా క్వాలిటీ విషయంలో, నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సీనియర్ టెక్నీషియన్స్‌తో నిర్మించిన ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది” అని తెలిపాడు.

Read More: Syed Sohel Ryan (సయ్యద్ సొహైల్ రియాన్) : సెల్ఫీస్టార్‌గా మారిన బిగ్‌బాస్ సెలబ్రిటీ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!