Biggboss Season6: త్వరలో బిగ్ బాస్ సీజన్ 6.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్!

Updated on Jun 02, 2022 09:07 PM IST
బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6)
బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6)


Biggboss Season 6: తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పెద్ద సెన్సషనల్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతీ సంవత్సరం బిగ్ బాస్ అభిమానులు ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ప్రతీ ఏడాది సరికొత్త సెలెబ్రటీస్ తో మన ముందుకు వచ్చే స్టార్ మా ఛానల్.. ఇప్పుడు తాజాగా ఒక్క సరికొత్త ప్రయోగం చేయబోతోంది. అదేంటంటే.. ఇటీవలే ఈ రియాలిటీ షో కి సంబంధించిన OTT వెర్షన్ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో డిస్నీ+హాట్ స్టార్ లో ప్రసారం అయిన విషయం అందరికీ తెలిసిందే. 

ఈ OTT షో లో హీరోయిన్ బిందు మాధవి టైటిల్ విన్నర్ గా నిలిచింది. అయితే, బిందు మాధవి (Bindu Madhai) ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ అవకాశాలు లేక తెరపై కనిపించడం మానేసిన ఈ అమ్మాయి బిగ్ బాస్ ద్వారా చాలా కాలం తర్వాత మళ్ళీ మన ముందుకు వచ్చింది. షో లో మగవాళ్ళతో సమానంగా పోటీ పడుతూ ఈ అమ్మాయి ఆడిన ఆటలు చూసి ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అయ్యింది. 

అయితే, బిగ్ బాస్ నాన్ స్టాప్ అలా ముగిసిందో లేదో.. ఇలా బిగ్ బాస్ 6కి రంగం సిద్ధమయింది. సామాన్యులకి అవకాశం అంటూ ప్రకటన కూడా ఇచ్చేశారు. ఎవరైనా ఈ షో లో పాల్గొనాలంటే, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు starmaa.startv.com లోకి వెళ్లి చూసుకోవచ్చు. కాగా, సీజన్ 6 కి కూడా హోస్ట్ లో ఎలాంటి మార్పు లేదు. కింగ్ అక్కినేని నాగార్జున రెట్టించిన ఉత్సాహంతో రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ కి సంబంధించిన లీకులు, ఊహాగానాలు షురూ అయ్యాయి. సీజన్ 6లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొందరి సెలెబ్రిటీల పేర్లు వైరల్ గా మారాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ క్రేజీగా ఉంది. 

ఈ నేపథ్యంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ బ్యూటీ త్వరలో టెలివిజన్ లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 6 (Biggboss Season 6) లో కూడా ఓ కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈమెతో పాటుగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచిన యాంకర్ శివ కూడా ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో టెలివిజన్ వెర్షన్ లో పాల్గొనబోతున్నట్టు సమాచారం అందుతోంది. అలా బిగ్ బాస్ OTT షో నుండి ప్రస్తుతానికి ఈ ఇద్దరు టెలివిజన్ వెర్షన్ లో కూడా పార్టిసిపేట్ చెయ్యబోతున్నట్టు దాదాపుగా ఖరారు అయింది. 

మరోవైపు..లక్స్ పాప అంటూ నరసింహనాయుడు చిత్రంలో బాలయ్య సరసన ఒక ఊపు ఊపిన గ్లామర్ బాంబ్ ఫ్లోరా షైనీ పేరు బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్ లో ప్రధానంగా వినిపిస్తోంది. ఫ్లోరా షైనీ వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావ్, ప్రేమతో రా లాంటి చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో బికినీల్లో ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాని వేడెక్కిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా నవ్వులు పూయించిన మాస్టర్ భరత్ కూడా బిగ్ బాస్ 6 (Biggboss Season 6) లోకి ఎంటర్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంకీ, రెడీ లాంటి చిత్రాల్లో అలరించిన భరత్ ఇప్పుడు 27 ఏళ్ల యువకుడు. 

ఇది ఇలా ఉండగా ప్రతి సీజన్ లో స్టార్ మా ఛానల్ (starmaa) వారు ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోలని, లేదా హీరోయిన్స్ ని , యాంకర్స్ ని తెస్తూ ఉంటారు. కానీ ఈసారి మంచి డిమాండ్ ఉన్న సెలెబ్రిటీలను కంటెస్టెంట్స్ గా తీసుకునేందుకు సన్నాహాలు చేస్తుంది స్టార్ మా.. వారిలో హైపర్ ఆది, యాంకర్ వర్షిణి మరియు ఒక్క పాపులర్ యూట్యూబర్, సీరియల్ ఆర్టిస్ట్స్ ని సంప్రదించినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో యాంకర్ గా రాణిస్తూనే తిరుగులేని గ్లామర్ తో కుర్రాళ్లని అట్రాక్ట్ చేసే మంజూష పేరు కూడా వినిపిస్తోంది. 

అనసూయ, శ్రీముఖి (Sreemukhi) లాంటి యాంకర్స్ కి ఏమాత్రం తగ్గని అందం ఆమె సొంతం. మంజూష సీజన్ 6లో తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నట్లు టాక్. యువ హీరో సుమంత్ అశ్విన్ కి కూడా బిగ్ బాస్ 6లో కంటెస్టెంట్ గా అవకాశం లభించినట్లు టాక్. సుమంత్ అశ్విన్ లవర్స్, హ్యాపీ వెడ్డింగ్ లాంటి చిత్రాలతో యువతకు చేరువయ్యాడు. సాఫ్ట్ నేచర్ ఉన్న అశ్విన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయితే ఎలా రాణిస్తాడో చూడాలి. వీరితో పాటు టీవీ నటుడు కౌశిక్ కృష్ణ, సెన్సేషనల్ సింగర్ బుల్లెట్ బండి ఫేమ్ మోహన భోగరాజు, యాంకర్ ధనుష్, పప్పీ మాస్టర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆగష్టు నెలలో ప్రారంభమయ్యే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.

Readmore: బిందు మాధవి (Bindu Madhavi) : ఈమె లెక్కే వేరు.. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తొలి మహిళగా సత్తా చాటేసింది!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!