Shanmukh Jaswanth: బిగ్ బాస్ 5 ర‌న్న‌ర్, యూట్యూబ‌ర్ షణ్ముఖ్‌ జశ్వంత్ ఇంట్లో తీవ్ర విషాదం!

Updated on May 30, 2022 05:57 PM IST
షణ్ముఖ్ జశ్వంత్ (Shanmukh Jaswanth)
షణ్ముఖ్ జశ్వంత్ (Shanmukh Jaswanth)

బిగ్ బాస్(Bigg Boss) కంటెస్టంట్ షణ్ముఖ్ జశ్వంత్ (Shanmukh Jaswanth). షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్ తో పేరు తెచ్చుకున్నాడు ఈయన పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందిన షణ్ముఖ్ జశ్వంత్‌ బిగ్‌బాస్‌ ఎంట్రీతో మరింత పాపులర్‌ అయ్యాడు. అతి తక్కువ టైంలో అత్యధిక యూట్యూబ్ సబ్ స్క్రయిబర్స్ సాధించిన తెలుగు యూట్యూబర్ గా కూడా రికార్డ్ సాధించాడు షణ్ముఖ్. ఈ ఫేమ్ తో బిగ్‌బాస్ లో కూడా పాల్గొని అందర్నీ మెప్పించాడు.  

తనదైన ఆట తీరుతో బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu) ఐదో సీజన్‌లో చివరకు నిలిచి, రన్నరఫ్‌గా మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. అనేకమంది అభిమానులకు కూడా సంపాదించుకున్నాడు. అయితే అదే సమయంలో ఇదే షో.. తన ప్రేయసితో విడిపోవడానికి కారణమైంది. సోషల్‌ మీడియాలో క్యూట్‌ పెయిర్‌గా పేరు సంపాదించుకున్న దీప్తి సునైనా, షణ్ముఖ్‌ గతేడాదిలో విడిపోయిన విషయం తెలిసిందే. 

ఇప్పటికి కూడా దీప్తి (Deepthi Sunaina) గురించి సన్నిహితుల వద్ద బాధపడతాడని సమాచారం. ఆ బాధని మర్చిపోవడానికి వర్క్ లో బిజీ అవుతున్నాడు షన్ను. దీంతో షణ్ముఖ్‌ జశ్వంత్‌ తన కెరీర్‌పై ఫోకస్‌ పెట్టాడు. త్వరలో మరో కొత్త సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నాడు షణ్ముఖ్. 'ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌' సిరీస్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.  

ఇదిలా ఉంటే.. తాజాగా షన్ను ఇంట్లో విషాదం నెలకొంది. అంతా సవ్యంగా జరుగుతున్న స‌మ‌యంలో షణ్ముఖ్‌ (Shanmukh Jaswanth) జీవితంలో విషాదం నెలకొంది. షణ్ముఖ్‌ బామ్మ మరణించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు షణ్ను తన బామ్మతో కలిసి ఉన్న వీడియోను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశాడు. ఈ స్టోరీకి రిప్‌ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. 

బామ్మతో షణ్ముకు (Shanmukh Jaswanth) ఉన్న అటాచ్‌మెంట్‌ చూసి ఎమోషనల్ అవుతున్నారు. ఈ వీడియోలో తన పెళ్లి చూస్తావా అని షణ్ను అడగ్గా 'ఏమో చూస్తానో లేదో..' అని బామ్మ అన్నట్లుగా ఉంది. 'నువ్ ఉండాలి' అని షణ్ము అనగా, 'నీ పెళ్లి వరకు కచ్చితంగా ఉంటుంది' అని వెనకాల నుంచి మాటలు వినిపించాయి. 

మామూలుగానే షన్ను ఈ మధ్య డిప్రెషన్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. అసలే దీప్తి సునయన (Deepthi Sunaina) బ్రేకప్‌తో షన్ను తీవ్రంగా బాధపడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే మొన్న బిగ్ బాస్ స్టేజ్ మీదకు షన్ను వచ్చిన సమయంలోనూ దీప్తి సునయన టాపిక్ వచ్చినా తప్పించుకోకుండా సమాధానం చెప్పాడు. దీప్తి సునయనని త్వరలోనే కలుస్తాను అని అందరి ముందే ధైర్యంగా చెప్పేశాడు. అయితే షన్ను మాత్రం ఇంకా ఆ బాధలోనే ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!