Deepika Pilli: బ్లాక్ డ్రెస్ లో కామెడీ స్టార్స్ యాంక‌ర్ దీపికా పిల్లి హొయ‌లు!

Updated on May 16, 2022 06:54 PM IST
యాంక‌ర్ దీపికా పిల్లి (Deepika Pilli)
యాంక‌ర్ దీపికా పిల్లి (Deepika Pilli)

బుల్లితెర‌పై ప్ర‌స్తుతం ఉన్న‌ యాంక‌ర్స్‌తో పోటీ ప‌డుతూ స‌త్తా చాటుతున్న అందాల ముద్దుగుమ్మ దీపికా పిల్లి (Deepika Pilli). ఈ యంగ్ యాంకర్ ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ సంద‌డి చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ చిరు చీకటిలో సెక్సీ పోజులతో రచ్చ చేస్తూ గిలిగింతలు పెడుతోంది. బ్యాక్ లెస్ బ్లాక్ ట్రెండీ వేర్ లో సెగలు రేపుతూ.. చిలిపిగా కవ్విస్తోంది. కాగా, ఈ భామ ఇచ్చిన కొంటె పోజులు నెటిజన్లను విప‌రీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ బ్యూటీ అంత‌గా గ్లామర్‌ షో (Glamour Show) చేయకపోయినా ఎంతో అందంగా ఉండటం విశేషం. ఇక‌, బ్లాక్ డ్రెస్‌లో ఆమె ఎర్రని బుగ్గలు మరింత పింక్‌గా మారిపోయి చూప‌రుల‌ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం దీపికా పిల్లి ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి అమ్మ‌డి అందాల‌కు ముగ్ధులు అవుతున్న నెటిజ‌న్స్ కూడా క్యూట్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. దీపికా పిల్లి గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ప్రతి వారం ఒకటి రెండు సార్లు తన హాట్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని షేర్ చేస్తూ సందడి చేస్తోంది. 

కాగా, ఈటీవీ టాప్ రేటెడ్ షోలలో ఒకటిగా ఉన్న (Dhee Dance Show) ఢీ డాన్స్ రియాలిటీ షోతో ఆమె యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఢీ సీజన్ 13లో మ‌రో యాంకర్ రష్మీతో పాటు ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు. ఆ షో వ‌ల్లే దీపికాకు మంచి పాపులారిటీ తెచ్చింది. ఢీ 13షోలో ఆమె చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఈ షో లో హైపర్‌ ఆదితో (Hyper Adi) చేసిన రొమాన్స్ పీక్‌ అని చెప్పవ‌చ్చు. రష్మి, సుడిగాలి సుధీర్ ఇద్ద‌రూ కెమిస్ట్రీ పండిస్తూ షోని రక్తికట్టిస్తుంటే, దీపికా పిల్లి హైపర్‌ ఆదితో చిలిపి పనులు చేస్తూ అందరి చూపులను తమ వైపు తిప్పుకున్నారు. అయితే, అనూహ్యంగా ఢీ 14 నుంచి ఆమెను యాంకర్ రష్మీని కూడా తప్పించారు. ఆ షోలో సమూల మార్పులు చేయడంతో.. ఒకప్పటి క్రేజ్ కోల్పోయింది. అయినప్పటికీ దీపికా పిల్లికి బుల్లితెరపై అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్ర‌స్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రాంలో దీపికా పిల్లి యాంకర్ గా చేస్తున్నారు. మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు, కొరియోగ్రాఫ‌ర్ శేఖర్ మాస్టర్ జడ్జెస్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ ఈ షో ఇప్పుడిప్పుడే మంచి ఆదరణ దక్కించుకుంటోంది. అలాగే సర్కార్ పేరుతో తెలుగు ఓటీటీ ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ఓ షో ప్రసారం అవుతోంది. స్టార్ యాంకర్ ప్రదీప్ ఈ షోని నిర్వహిస్తున్నారు. కాగా, సర్కార్ సీజన్ 2 లో కూడా దీపికా పిల్లి మెరిశారు. 

 

యాంక‌ర్ దీపికా పిల్లి (Deepika Pilli)

అలాగే పలు బుల్లితెర ప్రత్యేక కార్యక్రమాల్లో దీపికా పిల్లి (Deepika Pilli) సందడి చేస్తున్నారు. గత రెండేళ్లలో ఆమె పాపులారిటీ అమాంతంగా పెరిగిపోయింది. దీంతో రాబోయే రోజుల్లో ఆమె స్టార్ యాంకర్ హోదా పట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పటి టిక్ టాక్ స్టార్ కు ఈ రేంజ్ పాపులారిటీ రావ‌డం విశేషమే అని చెప్పవ‌చ్చు. మ‌రో హాట్ యాంక‌ర్స్ విష్ణు ప్రియ, వర్షిణి వంటి యాంకర్స్ తో పోల్చితే దీపికా పిల్లి చాలా త్వరగానే సక్సెస్ అయ్యారు. అయితే, ఈ భామ‌ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా భారీ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. సోషల్ మీడియా (Social Media) ద్వారానే లక్షల మంది అభిమానులను ఏర్ప‌రుచుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఇరవై లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. అంత‌కుముందు టీవీ షోస్ చేసిన‌ అనుభవం లేకపోయినా తనవంతు గ్లామర్‌ షోతో, మరోవైపు ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

Advertisement
Credits: instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!