Samantha: స‌మంత య‌శోద సినిమా ఎలా ఉండ‌బోతుందంటే...

Updated on May 06, 2022 10:21 AM IST
స‌మంత చేస్తున్న య‌శోద సినిమా గురించిన లేటెస్ట్ అప్ డేట్
స‌మంత చేస్తున్న య‌శోద సినిమా గురించిన లేటెస్ట్ అప్ డేట్

స‌మంత(Samantha)తెలుగు సినిమా ఇండ్ర‌స్ట్రీలో టాప్ హీరోయిన్. క్యూట్ పాత్ర‌లే కాకుండా లీడ్ రోల్‌లో కూడా సూప‌ర్‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం స‌మంత స‌రి కొత్త క్యారెక్ట‌ర్ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.  స‌మంత చేస్తున్న య‌శోద సినిమా గురించిన లేటెస్ట్ అప్ డేట్ ఇంట్ర‌స్ట్రింగ్‌గా ఉంది. 

ఏం మాయ చేశావే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన స‌మంత టాప్ స్టార్ అయ్యారు. ప్ర‌తీ సినిమాలో కొత్త ద‌నం ఉండే క్యారెక్ట‌ర్లు చేయ‌డం స‌మంత(Samantha) స్పెషాలిటీ. సైన్స్,  ఫ్రిక్ష‌న్, థ్రిల్ల‌ర్ సినిమాగా య‌శోద సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. 
 

య‌శోద మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్‌ను మే 5న రిలీజ్ చేశారు. హ‌రి, హ‌రీష్ ద‌ర్శ‌కులుగా శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను నిర్మి స్తున్నారు. ఈ సినిమా నిర్మాతగా శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్‌లు  య‌శోద సినిమాలో న‌టిస్తున్నారు. 

సమంతకు ‘ది ఫ్యామిలీ మేన్’ సిరీస్ సీజన్2 ఓ రేంజ్‌లో పేరు తెచ్చి పెట్టింది. స‌మంత క్రేజ్ మ‌రింత పెంచేలా య‌శోద సినిమా ఉంటుంద‌ని  నిర్మాత శివలెంక చెప్పారు. య‌శోద సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిన‌ట్టే అంటున్నారు. జూన్ ఫ‌స్ట్ వీక్ పూర్త‌వుతుంద‌న్నారు. హ‌రి, హ‌రీష్‌లు ఇద్ద‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న య‌శోద సినిమా ఆగ‌స్టు 12న రిలీజ్ కానుంది.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స‌మంత (Samantha) కొత్త సినిమా య‌శోద సినిమా రిలీజ్ చేయ‌నున్నారు. ది ఫ్యామిలీ మేన్ సీజ‌న్2కు మించి స‌మంత వినోదం అందిస్తార‌ని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!