విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన లైగర్‌‌ సినిమాకు సీక్వెల్‌ తీస్తారా? పూరీ కామెంట్స్

Updated on Aug 21, 2022 05:08 PM IST
లైగర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరీ జగన్నాథ్‌ను ఇంటర్వ్యూ చేసిన చార్మి
లైగర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరీ జగన్నాథ్‌ను ఇంటర్వ్యూ చేసిన చార్మి

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న సినిమా  'లైగర్ '. చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

ఫస్ట్‌ లుక్‌, టీజర్, ట్రైలర్, గ్లింప్స్‌ మొదలైనవాటిని రిలీజ్ చేస్తూ, సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో 'లైగర్ ' సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఒకటి బయటికి వచ్చింది.

'లైగర్ ' సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు మేకర్స్. ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన చార్మి చేసిన ఇంటర్వ్యూలో పూరీ జగన్నాథ్‌, విజయ్ దేవరకొండ తెలిపారు.

లైగర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరీ జగన్నాథ్‌ను ఇంటర్వ్యూ చేసిన చార్మి

విజయం సాధిస్తే..

అయితే ఈ అంశంపై పూర్తి స్పష్టతతో లేనప్పటికీ..  సీక్వెల్‌ను తెరకెక్కించే ఆలోచన ఉందని మాత్రం తెలుస్తోంది. త్వరలో 'లైగర్ ' సినిమా విడుదల కాబోతోంది. ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధిస్తే, దానికి సీక్వెల్‌ తీసే ఆలోచన రావచ్చని సమాచారం.

అయితే చార్మీ వేసిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్​ ఇచ్చిన సమాధానం మాత్రం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. 'లైగర్ ' సినిమాకు సీక్వెల్ ఉండచ్చు, ఉండకపోవచ్చు. దీని గురించి ఇప్పుడే మాట్లాడడం కరెక్ట్‌ కాదని ' వారు అన్నారు. 'లైగర్ ' సినిమా భారీ హిట్ సాధించి, మంచి కలెక్షన్లు వస్తే సీక్వెల్‌ను తెరకెక్కించే ఆలోచన తప్పకుండా వస్తుందని ' చెప్పారు విజయ్. 

దర్శకుడు పూరి జగన్నాథ్‌ అయితే మరో విషయాన్ని కూడా చెప్పారు. 'లైగర్‌' సినిమాకు సీక్వెల్‌గా.. 'లైగర్‌ 2' సినిమాను తెరకెక్కించాలని కరణ్‌ జోహార్‌‌ అడిగారని తెలిపారు.  విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా, అనన్య పాండే హీరోయిన్‌గా తెరకెక్కించిన 'లైగర్‌‌ 'కు నిజంగానే సీక్వెల్‌ తీసే ఆలోచన ఉందా.. లేక ప్రచారం కోసం ఈ విషయాన్ని చెప్పారా అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫలితాన్ని బట్టి తెలుస్తుంది. 

Read More : Liger: 'లైగ‌ర్' కోసం మూడేళ్లు శ్రమించాను.. ప్రేక్ష‌కులు ఉన్నారు నా కెందుకు భ‌యం - విజ‌య్ (Vijay Devarakonda)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!