విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) 'లైగర్' సినిమా రన్ టైమ్ ఎంతో తెలుసా.. సెన్సార్ పూర్తి
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'లైగర్'. ఈ సినిమాపై సెన్సార్ బోర్డు నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మొత్తం 140.20 నిమిషాల రన్ టైమ్‌తో సెన్సార్‌కు వెళ్లిన ఈ సినిమాకి బోర్డు ఏడు మార్పులు చేర్పులు సూచించింది. ఎఫ్‌తో మొదలయ్యే అమర్యాదకరమైన పదాన్ని సినిమాలో చాలాచోట్ల నటీనటులు ఉపయోగించారని.. అలాంటి పదాలను మ్యూట్ చేయాలని చెప్పింది.
కొన్ని సీన్స్‌లో ఎదుటివారిపై కోపాన్ని తెలియజేస్తూ నటీనటులు చేసే సైగలు కూడా అసభ్యకరంగా ఉన్నాయని వాటిని బ్లర్ చేయమని తెలిపింది. అలాగే, చేతులతో సైగలు చేసే మరో సన్నివేశం కూడా అభ్యంతరకరంగా ఉందని, దాన్ని తొలగించమని చెప్పింది.
కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'లైగర్' ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనన్యా పాండే హీరోయిన్‌గా నటించారు.
'లైగర్'కు ట్విటర్ ఎమోజీ
మరోవైపు 'లైగర్'కు సోషల్ మీడియా వేదిక ట్విటర్ స్పెషల్ ఎమోజీని ఇచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడులవుతుండటంతో సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు మరింత చేరువయ్యే క్రమంలో చిత్ర బృందం ట్విటర్‌కు దరఖాస్తు చేయగా #Liger హ్యాష్‌టాగ్ జత చేయగానే విజయ్ దేవరకొండ ఫొటోతో కూడిన ఎమోజీ వస్తుంది.
ట్విటర్ ఎమోజీని పొందిన మూడో సినిమాగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లైగర్ రికార్డుల్లో నిలిచింది. ఇప్పటివరకూ తెలుగులో ప్రభాస్ నటించిన సాహో', మహేశ్‌బాబు 'సర్కారు వారి పాట' సినిమాలకు మాత్రమే ట్విటర్ ఎమోజీలు ఇచ్చింది.