మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) దేశభక్తి చిత్రంలో నటిస్తున్నారా? ఈ చిత్రం గురించి టాప్ 5 ఆసక్తికర విషయాలు !

Updated on Sep 17, 2022 01:36 PM IST
ముకుంద, కంచె, ఫిదా, తొలి ప్రేమ, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలతో తెలుగులో పాపులర్ అయిన హీరో వరుణ్ తేజ్ (Varun Tej)
ముకుంద, కంచె, ఫిదా, తొలి ప్రేమ, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలతో తెలుగులో పాపులర్ అయిన హీరో వరుణ్ తేజ్ (Varun Tej)

వరుణ్ తేజ్ (Varun Tej) .. మెగా హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగిన కథానాయకుడు. 'ముకుంద' చిత్రంతో కెరీర్ ప్రారంభించిన వరుణ్ తేజ్ ఆ తర్వాత ఫిదా, తొలి ప్రేమ, గద్దలకొండ గణేష్ లాంటి చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆయన ఇటీవలే నటించిన 'గని' సినిమా మాత్రం అనుకున్నంత ప్రజాదరణ పొందలేదు. ఈ క్రమంలో ఇటీవలే మరో సినిమాకి సైన్ చేశారు వరుణ్. ఆ సినిమా కథా కమామీషు ఏంటో తెలుసుకుందాం

VT13 పై భారీ అంచనాలు

వరుణ్ తేజ్ నటిస్తున్న 13వ చిత్రంపై ఆయన అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ సెప్టెంబర్ 19వ తేదిన వచ్చే అవకాశాలున్నాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుందని పలు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి వరుణ్ తన సోషల్ మీడియా ఖాతాలో 'Touch the sky with Glory ! VT13 అంటూ ఓ పోస్ట్ చేశారు.

దేశభక్తి చిత్రమా?

ఈ సినిమా దేశభక్తి చిత్రం అయ్యే అవకాశం ఉందని టాక్. ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించి హింట్ ఇస్తూ, ఇప్పటికే ఓ వీడియోను వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్టు చేశారు. ఈ వీడియోలో వరుణ్ సినిమా స్క్రిప్ట్ చదువుతూ కనిపిస్తారు. అలాగే స్క్రిప్ట్ ఆఖరి పేజీలో 'జై హింద్' అనే పదం మనకు కనిపిస్తుంది. దీనికి తోడు వీడియోలో ఓ ఎయిర్ క్రాఫ్ట్‌ను కూడా చూడవచ్చు.

ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు

ఈ సినిమా కచ్చితంగా ఒక వీరుడి కథ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఎందుకంటే మనకు వీడియోలో "Bravery is not the absence of fear. But the action in the face of fear" అనే క్యాప్షన్ కనిపిస్తుంది. దీంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం, భయం, వీరత్వం లాంటి పేట్రియాటిక్ అంశాలతో కూడిన డిఫరెంట్ కథను వరుణ్ ఎంచుకున్నారని మనం కచ్చితంగా చెప్పవచ్చు. 

 

ఇలాంటి సబ్జెక్టులు వరుణ్‌కి కొత్త కాదు

వైవిధ్యమైన సబ్జెక్టులు ఎంచుకోవడంలో వరుణ్ తేజ్ ఎప్పుడూ ముందుంటారు. గతంలో కూడా క్రిష్ దర్శకత్వంలో 'కంచె' సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు. అలాగే ఆ తర్వాత సంకల్ప్ రెడ్డి డైరెక్షన్‌లో 'అంతరిక్షం' లాంటి వైవిధ్యమైన సినిమాని కూడా చేశారు. ఈ క్రమంలో వరుణ్ నటిస్తున్న ఈ తాజా చిత్రంపై కూడా అభిమానులకు ఆసక్తి పెరిగింది. 

మరి VT12 మాటేమిటి?

చిత్రమేమిటంటే.. ఈ సినిమాకి ముందు మరో చిత్రాన్ని కూడా వరుణ్ పూర్తి చేయాల్సి ఉంది. నాగబాబు సమర్పించే ఈ చిత్రాన్ని బాపినీడు, బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లండన్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో వరుణ్ తేజ్ బాడీగార్డు పాత్రలో నటిస్తున్నారట.

ఏదేమైనా, ప్రస్తుతం ఒక బ్లాక్ బస్టర్ హిట్ వరుణ్ తేజ్‌కు నిజంగానే అవసరం. కనుక VT13 పై గట్టి నమ్మకాలున్నాయనే చెప్పవచ్చు.

Read More:  షారుఖ్ తో నటించడానికి సిద్దమే.. బాలీవుడ్ ఎంట్రీ గురించి వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!