ఆ విషయంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘ఆచార్య’ను దాటేసిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘లైగర్’

Updated on Aug 30, 2022 06:22 PM IST
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘ఆచార్య’, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘లైగర్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘ఆచార్య’, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘లైగర్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మెగా పవర్‌‌స్టార్‌‌ రాంచరణ్‌తో కలిసి నటించిన ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అంతేకాకుండా ఊహించని రేంజ్‌లో లాస్‌ కూడా వచ్చిందని టాక్. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా రిజల్ట్‌ నిరాశపరచడంతో తన తర్వాత సినిమాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు చిరు.

ఇక, రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) – డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా లైగర్. మోస్ట్‌ అవైటెడ్‌ సినిమాగా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన లైగర్ సినిమా ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటించగా.. చార్మి, కరణ్‌ జోహార్‌‌ సంయుక్తంగా నిర్మించారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘ఆచార్య’, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘లైగర్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి

ట్రేడ్‌ వర్గాల సమాచారం?

భారీ అంచనాల మధ్య టాలీవుడ్‌తో సహా ఓవర్సీస్‌లో కూడా రిలీజైన లైగర్ సినిమాకు మొదటిరోజే నెగెటివ్ టాక్‌ వచ్చింది. హిందీలో కూడా భారీ అంచనాల మధ్య సినిమా విడుదలైంది. అయితే ఎవరూ ఊహించని విధంగా సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ నష్టాలు రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ‘ఆచార్య’ సినిమా ఎక్కువగా నష్టాలను మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు నష్టాల విషయంలో చిరంజీవి (Chiranjeevi) ఆచార్య సినిమాను విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లైగర్‌‌ సినిమా దాటేస్తుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఆచార్య సినిమా బడ్జెట్‌తో కేవలం 32 శాతం మాత్రమే కలెక్షన్ల రూపంలో రికవర్ చేయగా.. లైగర్ అయితే మరో రెండు శాతం తక్కువగానే వసూలు చేస్తుందని అంటున్నారు.

Read More : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అల్లు అర్జున్ (Allu Arjun) లపై.. దేవి శ్రీ ప్రసాద్ కామెంట్లు‌!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!