Liger: 'లైగ‌ర్' కంటే డ‌బుల్ బ‌డ్జెట్‌తో 'జ‌న‌గ‌ణ‌మ‌న' నిర్మిస్తున్నాం - పూరీ జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh)

Updated on Aug 21, 2022 05:26 PM IST
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చిన ప్ర‌తీ ఒక్క‌రు 'లైగ‌ర్' సినిమా చూస్తే.. ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ‌డం ఖాయ‌మ‌న్నారు పూరీ జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh). 
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చిన ప్ర‌తీ ఒక్క‌రు 'లైగ‌ర్' సినిమా చూస్తే.. ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ‌డం ఖాయ‌మ‌న్నారు పూరీ జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh). 

Liger: టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) 'లైగ‌ర్' సినిమాతో త‌న స‌త్తా ఏంటో ప్ర‌పంచానికి చూపించాల‌నుకుంటున్నారు. 'లైగ‌ర్' సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పూరీ జ‌గ‌న్నాథ్ ప‌లు విష‌యాల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చిన ప్ర‌తీ ఒక్క‌రు టికెట్ కొని 'లైగ‌ర్' సినిమా చూస్తే.. ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ‌డం ఖాయమంటూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు పూరీ జ‌గ‌న్నాథ్. 

 

యాక్ట‌ర్స్ అద‌ర‌గొట్టారు - పూరీ

గుంటూరులో 'లైగ‌ర్' (Liger) ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ ఈవెంట్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే, పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మీకౌర్ హాజ‌ర‌య్యారు. ఇప్ప‌టికే 'లైగ‌ర్' ప్ర‌మోషన్ల‌ను దేశ‌మంతటా నిర్వ‌హిస్తూ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కొత్త ట్రెండ్ సృష్టించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పూరీ జ‌గ‌న్నాథ్ ప‌లు విష‌యాల‌ను చెప్పుకొచ్చారు. 'లైగ‌ర్' చిత్రంలో  విజ‌య్ దేవ‌రకొండ (Vijay Devarakonda), అన‌న్య పాండే ఇద్ద‌రూ న‌ట‌న‌లో ఇర‌గ‌దీశార‌న్నారు. ర‌మ్య‌కృష్ణ కూడా న‌ట‌న‌లో ఉతికి ఆరేసిందింటూ చ‌మ‌త్కారంగా మాట్లాడారు. 

'లైగ‌ర్' కోసం ప్ర‌పంచ ఫైట‌ర్ - పూరీ 

ప్ర‌పంచంలో మైక్ టైస‌న్‌ను కొట్టే మొన‌గాడు లేడని పూరీ జ‌గ‌న్నాథ్ తెలిపారు. ముంబైలో 'లైగ‌ర్' (Liger) చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో మైక్ టైస‌న్ అంటే ఎవ‌ర‌ని అడిగార‌ట‌.. అందుకు పూరీ ఏమ‌న్నారంటే.. మైక్ టైస‌న్ అని గూగుల్‌లో టైప్ చేయండి.. అత‌ని గురించి తెలుస్తుంద‌ని చెప్పారట‌. ఇంత క‌ష్ట‌ప‌డి ప్ర‌పంచ ఫైట‌ర్ టైస‌న్‌ను తీసుకొస్తే.. కొంతమంది ఆయన ఎవరు? అడగడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.

'లైగ‌ర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన వాళ్లంతా ఒక్కో టికెట్ కొనుకున్నా, త‌మ‌ సినిమా సూపర్ హిట్ అవుతుందన్నారు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్. 'లైగ‌ర్' చిత్రాన్ని ఎంతో ప్రేమ‌తో తెర‌కెక్కించామ‌ని.. క‌లెక్ష‌న్ ఎంత ఉంటుందో చూడాల‌న్నారు. లైగ‌ర్ సినిమాకు డ‌బుల్ బ‌డ్జెట్‌తో జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రాన్ని తెర‌కెక్కించామ‌న్నారు.

Read More: 'లైగ‌ర్స్' ప్ర‌మోషన్స్ - విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) పై వ‌స్తున్న ట్రోల్స్‌పై జ‌ర్న‌లిస్టు క్లారిటీ 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!