Liger: 'లైగర్' మేకింగ్ స్టిల్స్ విడుదల చేసిన చిత్ర యూనిట్.. అదరగొట్టిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)!

Updated on Aug 10, 2022 06:41 PM IST
'లైగర్' (Liger) చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ మాస్ మేకింగ్ స్టిల్స్‌ను (Making Stills) చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.
'లైగర్' (Liger) చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ మాస్ మేకింగ్ స్టిల్స్‌ను (Making Stills) చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) బాక్సర్‌గా నటిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 'లైగర్‌' (Liger). 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది ట్యాగ్ లైన్. ఛార్మీ, పూరితో కలిసి బాలీవుడ్ మేకర్స్ కరణ్ జోహార్, హీరూ జోహార్, అపూర్వ మోహతా మొదలైనవారు .. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్‌తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్, రమ్య కృష్ణలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అనన్య పాండే విజయ్ దేవరకొండకు జోడీగా న‌టించింది.   

'లైగర్' (Liger) చిత్రం పాన్ ఇండియా లెవెల్‌లో పలు భాషల్లో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్, మేకింగ్ స్టిల్స్ ..ఇలా ప్రతిదీ ఈ చిత్రం ఫై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. మరో పక్క ఎప్పటికప్పుడు వరుస ఇంటర్వూలతో, విజయ్ దేవరకొండ తన సినిమాకు సంబంధించి ప్రతీ విషయాన్ని మీడియాతో పంచుకుంటున్నాడు. తన అభిమానులకు ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఇస్తున్నాడు. 

దేశ వ్యాప్తంగా చాలా కొత్త పద్ధతిలో  ప్రమోషన్లను చేయడం వల్ల,  'లైగర్' (Liger) సినిమాపై ఉత్తరాదిలో కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ మాస్ మేకింగ్ స్టిల్స్‌ను,  యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

విజ‌య్ దేవరకొండ బాక్సింగ్‌కు ముందు వ్యాయామం చేస్తున్న దృశ్యాల‌తో పాటు, ద‌ర్శ‌కుడితో కథ గురించి  చ‌ర్చిస్తున్న స‌న్నివేశాల‌ చిత్రాలను మేకర్స్ ఈ రోజే రిలీజ్ చేశారు.  అలాగే విజయ్ తన  హీరోయిన్‌ అనన్య పాండే (Ananya Pandey) తో మాట్లాడుతున్న స్టిల్‌ను కూడా విడుద‌ల చేశారు. 

విదేశీ ట్రైనీలు ఈ సినిమా కోసం విజ‌య్‌కు ప్రత్యేక శిక్ష‌ణ ఇచ్చారు.  తాజాగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, లైగర్ సినిమా గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 'లైగర్' సినిమా బ్లాక్ బస్టర్  అవుతుందని విజయ్ అభిప్రాయపడ్డారు. తనకు తన సినిమా రిజల్ట్ ముందే తెలిసిపోతుందని తెలిపారు. 

గతంలో 'అర్జున్ రెడ్డి' రిలీజ్ టైంలో కూడా ఇలానే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పానని ఆయన పేర్కొన్నారు. 'అర్జున్ రెడ్డి విషయంలో నేను అనుకున్నదే జరిగింది. ఇప్పుడు 'లైగర్' కూడా బ్లాక్ బస్టర్ అని డిక్లేర్ చేస్తున్నా' అని విజయ్ అన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

Read More: 'లైగర్'(Liger) ప్రమోషన్స్ లో అభిమానుల రచ్చ మామూలుగా లేదుగా.. మధ్యలోనే వెళ్లిపోయిన విజయ్(Vijay), అనన్య(Ananya)

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!