Vijay Devarakonda: 'రష్మిక నా డార్లింగ్ అంటున్న విజయ్'.. అసలు విషయం బయటపెట్టిన అనన్య పాండే(Ananya Pandey)..!
తెలుగు వెండితెరపై చూడముచ్చటైన జోడీగా పేరు తెచ్చుకున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika mandanna). వీరిద్దరూ టాలీవుడ్ రూమర్డ్ కపుల్‌గా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. విజయ్-రష్మికల మధ్య ప్రేమాయణం కూడా నడుస్తోందని, వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవచ్చన్న వదంతులు కూడా పుట్టుకొచ్చాయి. అయితే ఈ పుకార్లను వారిద్దరూ ఎప్పటికప్పుడు ఖండించినప్పటికీ, రూమర్లకు మాత్రం చెక్ పడటం లేదు.
తాజాగా ఈ పుకార్లలో నిజమెంతో తెలుసుకునే ప్రయత్నం చేశాడు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar). 'లైగర్' బ్యూటీ అనన్య పాండేతో విజయ్ 'కాఫీ విత్ కరణ్ షో'లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్‌ని రష్మికతో డేటింగ్ రూమర్స్‌పై ఆరా తీయగా.. 'తను నా డార్లింగ్' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ రౌడీ స్టార్.
ఈ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ.. "రష్మిక (Rashmika Mandanna) నా డార్లింగ్. నా కెరీర్ మొదట్లోనే రష్మికతో రెండు సినిమాలు చేశాను. షూటింగ్ సమయంలో మేం మంచి స్నేహితులమయ్యాం. మేమిద్దరం కెరీర్, జీవితంలోని కష్టసుఖాల గురించి మాట్లాడుకుంటాం. మా మధ్య మంచి బాండింగ్ ఉంది. తనంటే నాకు చాలా ఇష్టం" అని పేర్కొన్నారు. అయితే 'రష్మిక నా డార్లింగ్' అని చెప్పడంతో విజయ్, రష్మికల ఫ్యాన్స్ ఈ కామెంట్లను బాగా వైరల్ చేస్తున్నారు.
అనంతరం కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ రిలేషన్ షిప్ స్టేటస్‌పై 'మీ అభిప్రాయం ఏంటని' అనన్య పాండేను (Ananya Pandey) ప్రశ్నించాడు. దీనికి ఈ అమ్మడు సమాధానమిస్తూ " హీ ఈజ్ ఇన్ ‘రష్’ (He is in rush) ఫర్ మీట్ మీకా.. మీకా సింగ్" అని సాగదీస్తూ చెప్పింది. కరణ్ దీనికి సమాధానంగా.. "ఓ రష్-మిక (Rush-Mika)" అని రష్మిక పేరు వచ్చేలా అన్నారు.
అనన్య ఇలా వేరే అర్థం వచ్చేలా బదులిస్తూ రష్మిక, విజయ్ దేవరకొండల (Vijay Deverakonda) మధ్య ఉన్న బంధం గురించి చెప్పకనే తెలిపింది. దీంతో రష్మిక, విజయ్ మధ్య నిజంగానే ఏదో నడుస్తుందన్న వార్తలకి మరింత బలం చేకూరింది. పక్కనే ఉన్న విజయ్ ఏమాత్రం ఆశ్యర్యపడకుండా.. 'అయితే నువ్వు కూడా అదే అనుకుంటున్నావా?' అని తిరిగి అనన్యను ప్రశ్నించాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read More: విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తున్న 'లైగర్'.. భారీ ధరకు డిజిటల్ హక్కులు!