'లైగర్'(Liger) ప్రమోషన్స్ లో అభిమానుల రచ్చ మామూలుగా లేదుగా.. మధ్యలోనే వెళ్లిపోయిన విజయ్(Vijay), అనన్య(Ananya)

Updated on Aug 01, 2022 09:07 PM IST
విజ‌య్ (Vijay Deverakonda) మాట్లాడుతుండ‌గానే అభిమానులు ఒక్క సారిగా ఫ్యాన్స్ స్టేజ్ పైకి ఎగ‌బ‌డ్డారు. దాంతో అక్క‌డ‌ తొక్కిస‌లాట జ‌రిగింది.
విజ‌య్ (Vijay Deverakonda) మాట్లాడుతుండ‌గానే అభిమానులు ఒక్క సారిగా ఫ్యాన్స్ స్టేజ్ పైకి ఎగ‌బ‌డ్డారు. దాంతో అక్క‌డ‌ తొక్కిస‌లాట జ‌రిగింది.

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న క్రేజీ మూవీ ‘లైగర్’(Liger). బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar), పూరీ, ఛార్మీ నిర్మిస్తున్న ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. మొదటి నుంచీ ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో ఆగ‌స్టు 25న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ల‌ను స్టార్ చేశారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో ప్ర‌మోష‌న్ల‌ను జోరుగా జరుపుతున్నారు.   

ఈ క్రమంలో ముంబయిలోని ఓ మాల్‌లో ప్రచారం చేసేందుకు విజయ్, అనన్య (Ananya Pandey) ఓ ఈవెంట్‌కి వెళ్లారు. అక్కడ విజయ్‌, అనన్యలను చూసిన ఫ్యాన్స్‌ వేదిక వద్దకు గుంపులుగా దూసుకువచ్చారు. అంతేకాకుండా విజయ్‌.. విజయ్‌.. లైగర్‌.. లైగర్‌ అంటూ అభిమానులు చేసిన కేకలతో మాల్‌ దద్దరిల్లింది.  

 

విజ‌య్ దేవరకొండ (Vijay Deverakonda) మాట్లాడుతుండ‌గానే అభిమానులు ఒక్క సారిగా ప్రేక్ష‌కులు స్టేజ్ పైకి ఎగ‌బ‌డ్డారు. దాంతో అక్క‌డ‌ తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ తొక్కిస‌లాట‌లో ప‌లువురు కింద ప‌డ్డారు. వారిని బౌన్స‌ర్లు, ఇత‌ర సెక్యూరిటీ బ‌య‌ట‌కు తీశారు. నిర్వాహ‌కులు క్రౌడ్‌ను కంట్రోల్ చేయ‌లేక ఈ కార్య‌క్ర‌మాన్ని అర్థాంత‌రంగా ఆపేశారు. 

విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ (Vijay Deverakonda Instagram Story)

అక్కడ పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించడంతో విజయ్‌ (Vijay Deverakonda), అనన్య పాండేలు మధ్యలోనే వెళ్లిపోయారు. ఇక విజయ్‌ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. ‘మీ ప్రేమ నా హృదయాన్ని టచ్ చేసింది. మీరంతా క్షేమంగా ఇంటికి చేరుకున్నారని ఆశిస్తున్నాను. మీ అందరితో చాలా కాలం పాటు కలసి ఉండాలని అనుకుంటున్నాను. మీ అందరి గురించే ఆలోచిస్తూ బెడ్ మీదకు వెళుతున్నాను. గుడ్ నైట్ ముంబై, లైగర్ (Liger)’ అంటూ అందులో పేర్కొన్నాడు. 

కాగా ఇటీవ‌లే విడుద‌లైన లైగర్ ట్రైల‌ర్ (Liger Trailer) ఇండియా మొత్తం ఊపేసింది. ఆరున్న‌ర కోట్ల వ్యూస్‌తో గ‌త ప‌ద‌కొండు రోజులుగా యూట్యూబ్ ట్రెండిగ్‌లో ఉంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ చిత్రానికి విప‌రీత‌మైన బ‌జ్ ఏర్ప‌డింది.

ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌య్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌క‌పోయినా.. లైగ‌ర్ పోస్ట‌ర్లు, ట్రైల‌ర్‌ల‌తో హిందీలో విప‌రీత‌మైన క్రేజ్ ఏర్పడింది. ముంబైలోని ఓ చాయ్‌ వాలా ప్ర‌పంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కింది. ప్ర‌ముఖ బాక్స‌ర్ మైక్ టైస‌న్ (Mike Tyson) కీల‌కపాత్ర‌లో న‌టించాడు. 

Read More: 'రష్మిక నా డార్లింగ్‌ అంటున్న విజయ్'.. అసలు విషయం బయటపెట్టిన అనన్య పాండే(Ananya Pandey)..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!