లైగర్ (Liger): బ‌త‌కాలంటే గెల‌వాల్సిందే అని తేల్చి చెప్పేసిన విజయ్ దేవరకొండ

Updated on May 26, 2022 08:01 PM IST
Vijay Devarakonda: మాస్, క్లాస్ హీరోయిజంతో మెప్పించే న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్‌ లైగ‌ర్ సినిమా హీరోగా చేస్తున్నాడు. విజయ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా లైగ‌ర్ హంట్ థీమ్ రిలీజ్ చేశారు. 
Vijay Devarakonda: మాస్, క్లాస్ హీరోయిజంతో మెప్పించే న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్‌ లైగ‌ర్ సినిమా హీరోగా చేస్తున్నాడు. విజయ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా లైగ‌ర్ హంట్ థీమ్ రిలీజ్ చేశారు. 

మాస్, క్లాస్ హీరోయిజంతో మెప్పించే న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌  (Vijay Devarakonda). ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్‌ లైగ‌ర్ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. విజయ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా నిర్మాతలు ఇటీవలే లైగ‌ర్ హంట్ థీమ్ రిలీజ్ చేశారు. 

Vijay Devarakonda

విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) బ‌ర్త్‌డే మే 9 కావ‌డంతో, లైగ‌ర్ టీమ్ "హంట్ థీమ్" పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసింది. విజ‌య్ లుక్ ఎలా ఉండబోతుందో ఆ థీమ్‌లో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబులో హల్చల్ చేస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు సంద‌ర్భంగా అత‌ని అభిమానుల‌కు ఇలాంటి ఓ వైవిధ్యమైన థీమ్‌తో స‌ర్‌ప్రైజ్ ఇవ్వడం విశేషం.  

Vijay Devarakonda

బాక్సింగ్ నేపథ్యంలో సాగే క‌థ‌తో లైగ‌ర్ సినిమా ఉంటుంద‌ని టీజ‌ర్ చూస్తే తెలుస్తుంది. ఇక పూరి జ‌గ‌న్నాథ్ ఎలాంటి స‌ప్రైజ్ ప్లాన్ చేశారో,  సినిమా విడుద‌ల త‌ర్వాత చూడాలి. లైగ‌ర్ (Liger) పాన్ ఇండియా సినిమాగా విడుద‌ల కానుంది. భారీ బ‌డ్జెట్‌తో తీస్తున్న లైగ‌ర్ (Liger) సినిమా, విడుద‌ల‌కు ముందే కోట్ల రూపాయ‌ల‌ బిజినెస్ చేస్తోంది. బాక్స‌ర్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాలో తన నటన విశ్వరూపం చూపించనున్నారు. 

Vijay Devarakonda

గీత గోవిందంలో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda)  క్లాస్ హీరోగా మెప్పించాడు. అర్జున్ రెడ్డిలో మాస్ యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టాడు. ప్రస్తుతం లైగ‌ర్ సినిమాలో బాక్సర్‌గా తన అభిమానులను అలరించనున్నారు. లైగర్‌లో బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే విజ‌య్‌కు జోడిగా న‌టిస్తుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.  

Vijay Devarakonda

లైగ‌ర్ మూవీలో విశ్వ విఖ్యాత బాక్సర్ మైక్ టైస‌న్, విజ‌య్ దేవ‌ర‌కొండ తండ్రిగా న‌టించారనే వార్త వైర‌ల్ అయింది. అందులో, ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ఈ క్రమంలో దర్శకుడు పూరి జ‌గ‌న్నాథ్, తన పాన్ ఇండియా సినిమా "లైగ‌ర్" కోసం ఇంకా ఎలాంటి స‌ర్ ప్రైజ్ ప్లాన్ చేశాడో అభిమానులు వేచి చూడాల్సిందే. లైగ‌ర్ (Liger) సినిమా ఆగ‌స్టు 25న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో  విడుదల అవబోతోంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!