Liger: లైగ‌ర్ 'అక్‌డి ప‌క్‌డి' సాంగ్ ప్రోమో అవుట్.. విజ‌య్‌వి (Vijay Deverakonda) మాములు మాస్ స్టెప్పులు కావు

Updated on Jul 08, 2022 06:13 PM IST
Liger: లైగ‌ర్ 'అక్‌డి పక్‌డి' సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసింది.
Liger: లైగ‌ర్ 'అక్‌డి పక్‌డి' సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసింది.

Liger: హీరో విజ‌య్ దేవ‌రకొండ (Vijay Deverakonda) న‌టిస్తున్న పాన్ ఇండియా సినిమా 'లైగ‌ర్' ప్ర‌మోష‌న్ల జాత‌ర మొద‌లైంది. ఈ సినిమా నుంచి మేక‌ర్స్ మొద‌టి పాట‌ను జూలై 11న రిలీజ్ చేయ‌నున్నారు. 'అక్‌డి పక్‌డి' సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసింది. విజ‌య్ మాస్ స్టెప్పులు చూస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవాల్సిందే.పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో 'లైగ‌ర్' ఆగ‌స్టు 25 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి బాలీవుడ్ బ‌డా నిర్మాత క‌ర‌ణ్ జోహార్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఊరా మాస్ స్టెప్పులు వేసిన విజ‌య్
విజ‌య్ దేవ‌కొండ 'లైగ‌ర్' చిత్రంలో ఫుల్ ఎన‌ర్జీతో క‌నిపిస్తున్నారు. మాస్ స్టెప్పులు, తీన్ మార్ డాన్సుల‌తో అద‌ర‌గొడుతున్నారు. విజ‌య్ కాస్టూమ్స్ ఓ రేంజ్‌లో ఉంది. 'అక్‌డి ప‌క్‌డి' లిరిక్స్‌తో సాగే పాట‌లో ఈ యంగ్ హీరో ఊరా మాస్ స్టెప్పులు వేశారు. విజ‌య్ డాన్సులు చూసి అభిమానులు మైండ్ బ్లాక్ అయిందంటూ పోస్టులు పెడుతున్నారు. 

'లైగ‌ర్' సినిమా టీజ‌ర్‌ను జూలై 8 న రిలీజ్ చేయ‌నున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే న‌టించిన లైగ‌ర్ సినిమాను ఆగ‌స్టు 25 న రిలీజ్ చేయ‌నున్నారు. సినిమా విడుద‌ల‌కు ఇంకా నెల రోజుల స‌మ‌యం ఉండ‌టంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ల జోరు పెంచింది. ఇటీవలే నిర్మాతలు విజ‌య్ దేవ‌ర‌కొండ బోల్డ్ ఫోటోను రిలీజ్ చేశారు. తాను 'లైగ‌ర్' సినిమా కోసం ఎంతో శ్ర‌మించాన‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

లైగ‌ర్ ఓ బాక్స‌ర్ క‌థ‌!
బాక్సింగ్ నేప‌థ్యంలో 'లైగ‌ర్' సినిమా తెర‌కెక్కుతోంది.అంతర్జాతీయ బాక్సర్, లెజండరీ స్పోర్ట్స్‌మ్యాన్ మైక్ టైసన్ కూడా 'లైగ‌ర్' సినిమాలో న‌టిస్తున్నారు.'సాలా.. క్రాస్ బ్రీడ్' అనే డైలాగ్ ఈ సినిమాలోని ఏదో ప‌వ‌ర్ ఫుల్‌ సందర్భాన్ని గురించి చెబుతుంది . ఈ సినిమాలో మైక్ టైస‌న్ ఇండియ‌న్ మహిళను పెళ్లి చేసుకుంటాడని ముందుగానే కథను ఊహించి పలువురు పోస్టులు పెడుతున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. 

'లైగ‌ర్' సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టిస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 'లైగ‌ర్' ఆగ‌స్టు 25న విడుద‌ల కానుంది. ఈ సినిమాను రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో హీరోయిన్ ఛార్మి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌లు నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో  విడుదల కానుంది. 

Read More: Vijay Devarakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కోసం లేడీ వీరాభిమాని.. ఏం చేసిందో చూశారా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!