‘ఆదిపురుష్’ (Adipurudh)ను వదలని వివాదాలు.. మూవీ యూనిట్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు! 

Updated on Oct 13, 2022 01:10 PM IST
‘ఆదిపురుష్’ (Adipurudh) చిత్ర బృందానికి ఢిల్లీ హైకోర్టు (High Court of Delhi) నోటీసులు జారీ చేసింది
‘ఆదిపురుష్’ (Adipurudh) చిత్ర బృందానికి ఢిల్లీ హైకోర్టు (High Court of Delhi) నోటీసులు జారీ చేసింది

‘ఆదిపురుష్’ (Adipurudh) సినిమాను వివాదాలు వదలట్లేదు. అయోధ్యలో అక్టోబర్ 2న టీజర్ రిలీజైనప్పటి నుంచి ఈ చిత్రాన్ని కాంట్రవర్సీలు చుట్టుముడుతున్నాయి. రాముడు, రావణాసురుడి పాత్రలను అవమానపర్చేలా టీజర్ ఉందంటూ ‘ఆదిపురుష్​’ మేకర్స్‌పై ఫిర్యాదు నమోదైంది. 

అయోధ్య రామాలయ పూజారి కూడా ‘ఆదిపురుష్’ చిత్రం విడుదల కాకుండా చూడాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆదిపురుష్​’ చిత్ర బృందానికి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఢిల్లీ హైకోర్టు (High Court of Delhi)లో పిటిషన్ దాఖలైంది. మూవీ యూనిట్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది ఆశిష్ రాయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు పాత్రలు తోలుతో చేసిన దుస్తులు ధరించారని ఆ పిటిషన్‌లో తెలిపారు. 

‘ఆదిపురుష్’ చిత్ర నిర్మాత భూషణ్ కుమార్, హీరో ప్రభాస్‌ (Prabhas)తోపాటు కృతీ సనన్, సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోర్టును పిటిషనర్ కోరారు. ఈ మూవీ విడుదల కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. ప్రభాస్‌కు, ‘ఆదిపురుష్‌’ చిత్ర యూనిట్‌కు నోటీసులు జారీ చేసింది.

ఇకపోతే, ఓం రౌత్ (Om Raut) తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’​ చిత్రంలో ప్రభాస్ సరసన జానకి పాత్రలో కృతీ సనన్ నటిస్తున్నారు. రావణుడి పాత్రలో సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘ఆదిపురుష్’ చిత్రం.. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

కాగా, ‘ఆదిపురుష్’ కోసం బాలీవుడ్ హీరోలను కూడా కాదని.. ప్రభాస్‌ను మాత్రమే ఎంపిక చేసుకోవడంపై చిత్ర దర్శకుడు ఓం రౌత్ వివరణ ఇచ్చారు. ‘ఆదిపురుష్’ కథ రాస్తున్నప్పుడు.. రాముడి పాత్ర కోసం తన మనసులో కేవలం ప్రభాస్ మాత్రమే మెదిలారని అన్నారు. ప్రభాస్ ఒప్పుకోకపోతే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేది కాదని స్పష్టం చేశారు. ఆయన క్యారెక్టర్ చాలా ప్రత్యేకంగా, దైవికంగా ఉంటుందని ఓం రౌత్ పేర్కొన్నారు. 

Read more: ప్రభాస్ (Prabhas) లేకుంటే ‘ఆదిపురుష్’ (Adipurush) లేదు: ఓం రౌత్ (Om Raut)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!