‘అరి’ (Aari Movie) సినిమా నుంచి 'అసూయ' పాత్రలో హాట్ యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj) ఫస్ట్ లుక్ రిలీజ్..!

Updated on Oct 17, 2022 02:12 PM IST
తాజాగా ‘అరి’ (Aari Movie) చిత్రం నుంచి అనసూయ (Anasuya Bharadwaj) నటిస్తున్న 'అసూయ' (Jealousy) పాత్ర లుక్‌ని విడుదల చేశారు.
తాజాగా ‘అరి’ (Aari Movie) చిత్రం నుంచి అనసూయ (Anasuya Bharadwaj) నటిస్తున్న 'అసూయ' (Jealousy) పాత్ర లుక్‌ని విడుదల చేశారు.

‘పేపర్‌బాయ్‌’ (Paper Boy Movie) చిత్ర దర్శకుడు జయశంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అరి’ (Aari Movie). ‘మై నేమ్‌ ఈజ్‌ నో బడి’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు పెట్టుకున్న 'బ్యాడ్ ఈజ్ న్యూ గుడ్' అనే క్యాప్షన్ ఆసక్తికరంగా ఉంది. ఆర్వీ రెడ్డి సమర్పణలో అర్వీ సినిమాస్‌ పతాకంపై శ్రీనివాస్‌ రామిరెడ్డి, మారం శేషురెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

తాజాగా ‘అరి’ (Aari Movie) చిత్రం నుంచి అనసూయ (Anasuya Bharadwaj) నటిస్తున్న 'అసూయ' (జలసీ) పాత్ర లుక్‌ని విడుదల చేశారు. అంతకుముందు మనుషుల్లో ఉండే ఒక్కో స్వభావానికి ప్రతీకగా ఒక్కో పాత్రను నిర్వచించారు. ఇంకా ప్రైడ్‌గా సాయి కుమార్‌, యాంగర్‌ క్యారెక్టర్‌లో శ్రీకాంత్‌ అయ్యంగార్‌, లస్ట్‌గా వైవా హర్ష, గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్‌, అటాచ్‌మెంట్‌ క్యారెక్టర్‌లో సురభి ప్రభావతి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. 

మనిషి ఎలా బతకకూడదనేదాన్ని 'అరి' చిత్రం ద్వారా ఆసక్తికరంగా చెబుతున్నామని మూవీ యూనిట్ తెలిపింది. ఇక, ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనుప్‌ రూబెన్స్‌ వ్యవహరించగా.. సినిమాటోగ్రఫీ భానూ, జీతు అందించారు.

అరి’ (Aari Movie) చిత్రం నుంచి అనసూయ (Anasuya Bharadwaj) నటిస్తున్న 'అసూయ' (Jealousy) పాత్ర లుక్‌ని విడుదల చేశారు.

ఇదిలా ఉంటే..  ఇటీవల ‘తానా’ నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో సినీ నటి, యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj) పాల్గొనడం విశేషం. ఎక్కడున్నా తన వ్యాఖ్యానంతో సందడి వాతావరణం నెలకొనేలా చేసే అనసూయ.. ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆమె తనదైన యాంకరింగ్‌తో ఆకట్టుకున్నారు. 

ముఖ్యంగా ఈ ఫంక్షన్‌కు లంగా ఓణీలో దర్శనమిచ్చిన అనసూయ (Anasuya Bharadwaj) లుక్స్‌కు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇకపోతే, గత కొంతకాలంగా అనసూయ బుల్లితెరకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య ఆమె పెద్దగా టీవీ షోలు చేయడం లేదు. దీనికి కారణం ఆమె సినిమాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడమేనని తెలుస్తోంది. 

ప్రస్తుతం అనసూయ (Anasuya Bharadwaj) ‘రంగమార్తాండ’, ‘వేదాంతం రాఘవయ్య’, ‘హరిహర వీరమల్లు’తో పాటు ‘పుష్ప 2’, ‘భోళా శంకర్’ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తూ అనసూయ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాల ఫలితాలను బట్టి ఆమెకు మరిన్ని పెద్ద చిత్రాల్లో నటించే అవకాశాలు రావొచ్చు.

Read More: Anasuya Bharadwaj: వెబ్ సిరీస్ కోసం అలాంటి పాత్రలో నటించడానికి ఒప్పుకున్న హాట్ యాంకర్ అనసూయ..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!