బిగ్ బాస్ హౌస్ (BiggBoss Nonstop) లోకి ఎంట్రీ ఇచ్చిన అన‌సూయ‌.. కంటెస్టెంట్ల‌తో ఆట‌పాటలు!

Updated on May 13, 2022 09:18 PM IST
Anchor Anasuya (అన‌సూయ‌)
Anchor Anasuya (అన‌సూయ‌)

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఓటీటీలో ప్ర‌సార‌మవుతున్న‌ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ (BiggBoss Nonstop) షో చివ‌రి దశకు చేరుకుంది. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో గ్రాండ్ ఫినాలే జ‌ర‌గ‌బోతోంది. దీంతో కంటెస్టెంట్లలో టెన్షన్ వాతావ‌ర‌ణం మొదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం బిగ్ బాస్ హౌస్ ఇంటి స‌భ్యులు తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో నామినేషన్ ప్ర‌క్రియ‌లో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒకరిపై ఒకరు మాటల తూటాల‌తో దాడి చేసుకుంటున్నారు. మొన్న‌టివర‌కు స్ట్రాంగ్ కంటెస్టెంట్ల‌యిన అఖిల్ బిందు మాధ‌వి మ‌ధ్య మాట‌ల యుద్దం జ‌ర‌గ‌గా.. ప్ర‌స్తుతం నటరాజ్ మాస్టర్-బిందుల మధ్య శత్రుత్వం బాగా పెరిగిపోయింది. 

ఇదిలా ఉంటే, నామినేషన్ల విషయంలో (BiggBoss Nonstop) బిగ్ బాస్.. కంటెస్టెంట్లందరికీ షాకిచ్చాడు. ఇక‌, ఈ షో చివ‌రి ద‌శ‌కు చేరుకున్న నేప‌థ్యంలో ఈ వారం కంటెస్టెంట్లంతా నామినేషన్ లో ఉన్నట్లు ప్రకటించాడు. ఇక‌, ప్రస్తుతం హౌస్‌లో మిత్రా శర్మ, బాబా భాస్కర్, బిందు మాధవి, (Bindu Madhavi) యాంకర్ శివ, అనిల్ రాథోడ్, నటరాజ్ మాస్ట‌ర్, అరియనా, అఖిల్ ఉన్నారు. అయితే, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చని సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి నటి, హాట్ యాంకర్ అనసూయ ఎంట్రీ ఇచ్చింది. ఆమె రాక‌ సందర్భంగా నటరాజ్ మాస్టర్ అమ్మాయి వేషంలో ఎంట్రీ ఇచ్చారు. వ‌స్తూనే ‘‘బావొచ్చాడోయ్ మామ..’’ పాటకు నాటు స్టెప్పులతో ఇరగదీశాడు. ఇక‌, ఈ ప్రోమో చూసిన నెటిజనులు ‘పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అనంత‌రం టాస్క్ లో భాగంగా అనసూయ (Anasuya) ఇంటిస‌భ్యుల‌తో కొన్ని గేమ్స్ ఆడిచ్చారు. త‌ర్వాత‌, హౌస్‌మేట్స్‌కు బిగ్ బాస్ ఆడియన్స్ వేసిన పలు ప్రశ్నలను అడిగి వినిపించింది. అరియానా, అఖిల్‌ను ఉద్దేశిస్తూ ఫ్యామిలీ ఎపిసోడ్ తర్వాత బిందుకు ఎందుకు క్లోజ్ అయ్యారని పలువురు ఆడియ‌న్స్ ప్రశ్నించారు. వీటికి, వారు ఏం సమాధానం చెప్పారో తెలియాలంటే తాజా ఎపిసోడ్ చూడాల్సిందే.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!