అనసూయ (Anasuya), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఫ్యాన్స్ మధ్య ట్విటర్ వార్..తగ్గేదేలే అంటున్న హాట్ యాంకర్!

Updated on Aug 27, 2022 07:20 PM IST
‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా’ అంటూ అనసూయ ట్వీట్‌ (Anasuya Tweet) చేసింది.
‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా’ అంటూ అనసూయ ట్వీట్‌ (Anasuya Tweet) చేసింది.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కామెడీ షో జబర్దస్త్‌ (Jabardasth) షోను వీడినప్పటి నుంచి ఆమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. గ‌తంలో విజ‌య్ హీరోగా న‌టించిన 'అర్జున్ రెడ్డి' సినిమాపై అన‌సూయ చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్నేరేపాయి. దీంతో అన‌సూయ‌కి, విజ‌య్‌ ఫ్యాన్స్‌కి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. ఆ గొడ‌వ అంత‌టితో ముగిసిపోలేదు. ఇప్పుడు ‘లైగర్’ సినిమా సమయంలో మరోసారి బయటపడింది.

పాన్ ఇండియా లెవల్లో విడుదలైన 'లైగర్' (Liger) మూవీ దారుణమైన టాక్ తెచ్చుకోవడంతో అటు చిత్ర బృందం తీవ్ర నిరాశకు లోనైంది. అటు పూరి జగన్నాథ్ (Puri Jagannadh), ఛార్మి, విజయ్ ఇలా ఎవ్వరూ రెండ్రోజుల నుంచి బయటకు రాలేదు. సింగిల్ కామెంట్ కూడా చేయడం లేదు. ఈ బాధ నుంచి ఎలా బయటపడాలని ఫ్యాన్స్ చూస్తుండగా.. యాంకర్ అనసూయ రగులుతున్న నిప్పురవ్వలపై పెట్రోల్ పోసింది.

‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా’ అంటూ అనసూయ ట్వీట్‌ (Anasuya Tweet) చేసింది. దీనిపై విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విజయ్‌ని ఉద్దేశించే ఈ ట్వీట్‌ చేసిందని ఫ్యాన్స్‌ ఫైర్‌ అయ్యారు. దీంతో ఆమెను ఆంటీ అంటూ ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. దీంతో అనసూయకు-విజయ్‌ ఫ్యాన్స్‌కు మధ్య ట్విటర్‌ వార్‌ మొదలైంది.

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఫ్యాన్స్ అనసూయపై సోషల్ మీడియాలో మాటల యుద్ధం చేశారు. బూతులు తిట్టారు. దీనిపై అన‌సూయ కూడా అస్స‌లు త‌గ్గ‌టం లేదు. ‘మీరు నన్ను తిట్టిన తిట్లను మీ హీరోలకు పంపండి’ అంటూ కామెంట్ చేసింది. అయినా కూడా అనసూయపై ట్రోలింగ్ ఆగలేదు. ‘ఛీ ఛీ ఇదేం చెత్త.. బాబోయ్ క్లీన్ చేసి చేసి విసుగొస్తోంది’ అంటూ ఏడుపు ముఖం ఉన్న ఎమోజీని ఆమె కాసేపటికీ పోస్ట్ చేసింది. ట్రోల్స్ చేస్తున్న కొద్ది అనసూయ కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అయింది.

ఇక తనని, తన ఫ్యామిలీని ట్రోల్‌ చేస్తే (Trolls on Anasuya) చూస్తూ ఊరుకోనని, వారి ట్వీట్స్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. ఇక తనని ఆంటీ అని పిలుస్తూ అవమానిస్తున్నారడంతో ఓ నెటిజన్‌ ఆంటీ అనే పదాన్ని బూతుగా మార్చేశావుగా అంటూ కామెంట్‌ చేశాడు. దీనికి ఆమె ‘నా పిల్లల ఫ్రెండ్స్‌ పిలవడంలో, మీరు పిలవడంలో తేడా ఉంది. మీరు పిలిచే ఉద్దేశం వేరు’ అంటూ సమాధానం ఇచ్చింది. 

Read More: 'ఖుషి' (Kushi) టైటిల్ పెట్టినందుకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గర్విస్తారంటున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!