Anasuya Bharadwaj: వెబ్ సిరీస్ కోసం అలాంటి పాత్రలో నటించడానికి ఒప్పుకున్న హాట్ యాంకర్ అనసూయ..!

Updated on Jul 05, 2022 05:35 PM IST
అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ (Anasuya Bharadwaj)
అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ (Anasuya Bharadwaj)

హాట్ యాంక‌ర్ ఇమేజ్ తెచ్చుకున్న అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ (Anasuya Bharadwaj) గురించి బుల్లితెర‌, సిల్వ‌ర్ స్క్రీన్ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవసరంలేదు. అనసూయకు స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ ఉంది అభిమానుల్లో.  మొన్నటిదాకా బుల్లి తెరను తిరుగులేకుండా ఏలిన అందాల యాంకర్ ఇప్పుడు తన దృష్టిని వెండితెరపై పెట్టింది. మంచి పాత్రలను ఎంచుకుంటూ ఆచి తూచి అడుగులేస్తోంది. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'రంగస్థలం' (Rangasthalam Movie) సినిమాలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ, తరువాత 'పుష్ప' సినిమాలో ద్రాక్షాయణిగా మెరిసింది. ఆ రెండూ విభిన్నమైన పాత్రలే కావడం విశేషం. యితే, తాజాగా సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్న స‌మాచారం మేర‌కు.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌లకంటే ఛాలెంజింగ్ పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ క‌నిపించ‌నుంద‌ట‌. వివ‌రాల మేర‌కు.. ఆమె ఓ వేశ్య పాత్ర‌లో మెప్పించ‌నుంద‌ట‌. అయితే సినిమాలో కాద‌ట‌. వెబ్ సిరీస్‌లో. త్వ‌ర‌లోనే అన‌సూయ వెబ్ సిరీస్‌లో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 

అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ (Anasuya Bharadwaj)

బుల్లితెరపై జబర్దస్త్ షోతో (Jabardasth Comdey Show) యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ.. మెల్లగా నటిగా మారింది. ఇక రంగస్థలం చిత్రంలో తాను పోషించిన రంగమ్మత్త పాత్ర నటిగా తన కెరీర్‌నే మలుపు తిప్పింది. ఆ తర్వాత పుష్పలో విలన్‌గా ఆకట్టుకుంది. ఇప్పుడు వేశ్యగా నటించి.. మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్దమవుతోందట అనసూయ. ఇలా సినిమా అవకాశాలు కూడా ఎక్కువగా వస్తుండడంతోనే తాను జబర్దస్త్ కామెడీ షోను కూడా వదిలేసినట్లు సమాచారం.

ఆ వెబ్ సిరీస్ ఏంటంటే?
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ (Director Krish Jagarlamudi) జాగర్లమూడి స్క్రిప్ట్ అందిస్తున్న వెబ్ సిరీస్ ‘కన్యా శుల్కం’. గురజాడ అప్పారావు రచించిన నాటకం. దీని ఆధారంగా అదే పేరుతో క్రిష్ ఓ కథను సిద్ధం చేశాడని టాక్. అందులో మధుర వాణి పాత్రకు అనసూయను కాంటాక్ట్ చేశారని, ఆమె కూడా చేసేందుకు ఒప్పుకుందని చెప్పుకుంటున్నారు. కన్యాశుల్కంలో మధుర వాణి ఒక వేశ్య పాత్ర పేరు. ఈ పాత్ర చేసేందుకు అనసూయ ఒప్పుకుందంటే నిజంగా అది ఆమెకు పేరు తెచ్చిపెట్టడం ఖాయం. 

Read More: విభిన్న హెయిర్ స్టైల్ తో అందాలు ఒల‌క‌బోస్తున్న (Anasuya Bharadwaj) హాట్ యాంక‌ర్ అన‌సూయ‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!