Tollywood : మన తారల సెంటిమెంట్స్! ఒక్క సీన్‌లో అయినా వైట్ షర్ట్‌తో చిరు .. రిలీజ్‌కు ముందు దర్గాకు మహేష్ !
జాతకాలు, ముహూర్తాలు తదితర విషయాలను మూఢనమ్మకాలుగా చెప్తారు కొందరు. అయితే చాలా మంది వాటిని సెంటిమెంట్లుగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఇందుకు సామాన్యులతోపాటు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు.
ఒక సినిమా హిట్ అయితే అందులో ఫాలో అయిన సెంటిమెంట్‌నే తర్వాత సినిమాకు కూడా ఫాలో అవుతూ ఉంటారు చాలా మంది డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు.
ఉదాహరణకు ఒక యాక్టర్ తన సినిమాలో ఉంటే, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతుంటాడు ఒక డైరెక్టర్. ఆ నటుడిని తన సినిమాలోని కథలో ఒక్కచోట అయినా కనిపించేలా ప్లాన్ చేసుకుంటాడు. ఇక, సినిమా డైరెక్టరే సినిమాలో ఎక్కడో ఒక చోట కనిపిస్తాడు కూడా.
ఇక, హీరోల విషయంలో కూడా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి డైరెక్టర్లకు. ఆ సెంటిమెంట్లు ఒక్కోసారి మంచి ఫలితాలను రాబట్టవచ్చు.. లేదా పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. వీటన్నింటినీ పక్కన పెడితే స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్న టాలీవుడ్ (Tollywood) హీరోలు, హీరోయిన్లు కూడా కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. ఆ స్టార్ హీరోలు ఎవరు? వాళ్ల సెంటిమెంట్లు ఏంటి? అనే దానిపై ఒక లుక్ వేద్దాం..
మెగాస్టార్‌కు వైట్ షర్ట్..
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. అదేంటి చిరంజీవికి కూడా సెంటిమెంట్ ఉందా అని అనుకుంటున్నారా. 'ఇంద్ర ' సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత నుంచి మెగాస్టార్ నటించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ కనీసం ఒక్క సీన్‌లో అయినా, ఆయన వైట్ షర్ట్ వేసుకుని కనిపించాలని సెంటిమెంట్‌గా పెట్టుకున్నారట.
ముహూర్తం షాట్‌కు మహేష్ దూరం..
సూపర్‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతుంటారు. తన సినిమా ముహూర్తం షాట్‌కు ఆయన దూరంగా ఉంటారు. 'ఒక్కడు ' సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత నుంచి, ఆయన ఈ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. ఇక, తన సినిమా షూటింగ్ కోసం ముంబై ఎప్పుడు వెళ్లినా 'మారియట్ ' హోటల్‌లో మాత్రమే దిగాలనే సెంటిమెంట్ కూడా పెట్టుకున్నారు ప్రిన్స్.
ఆ హోటల్‌లో స్టే చేస్తేనే, తను షూటింగ్‌కు వెళ్లిన సినిమా హిట్ అవుతుందని నమ్ముతారు మహేష్. తన తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన, ఫస్ట్ లుక్ లేదా టీజర్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు మహేష్‌బాబు.
అలాగే చాలా కాలం వరకు మూడు అక్షరాలతోనే తన సినిమా టైటిల్స్ ఉండేలా చూసుకునేవారు మహేష్. ఒక్కడు, అతడు, ఖలేజా, అతిథి, అర్జున్, మహర్షి, పోకిరి, దూకుడు, ఆగడు, మురారి, స్పైడర్ వంటి సినిమాల టైటిల్స్ మూడు అక్షరాలు మాత్రమే.
మగధీర తర్వాత..
రాంచరణ్ హీరోగా నటించగా.. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటించింది. 'మగధీర ' సినిమాలో కాజల్ అగర్వాల్ వైట్ డ్రెస్‌లో మెరిసింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో.. ఆ తర్వాత నుంచి కాజల్ నటించిన ప్రతి సినిమాలోనూ ఒక్క ఫ్రేమ్‌లో అయినా వైట్ డ్రెస్‌లో కనిపించాలని సెంటిమెంట్‌గా పెట్టుకుందట.
డిసెంబర్‌లో సెంటిమెంట్..
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున (Nagarjuna) కూడా కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 30 సంవత్సరాలు దాటినా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు నాగ్. నాగ్ తొలి సినిమా విక్రమ్ సినిమా దగ్గర నుంచి ఆయన నటించిన తాజా చిత్రం బంగార్రాజు వరకు రోజురోజుకూ నాగార్జున వయసు తగ్గుతోందా అన్నట్టుగానే కనిపిస్తాడు.
సంతోషం, మన్మధుడు వంటి సూపర్‌హిట్ సినిమాల తర్వాత కొన్నాళ్లు నాగార్జున నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతపెద్ద విజయాన్ని సాధించలేదు. అయితే ఆ తర్వాత నాగ్ నటించిన ‘మాస్’ సినిమా, డిసెంబర్‌లో రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.ఇక అప్పటి నుంచి నాగార్జున డిసెంబర్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు.
తను హీరోగా నటించిన సినిమాలను దాదాపుగా డిసెంబర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు కింగ్. మన్మధుడు, మాస్, రగడ, రాజన్న సినిమాలు డిసెంబర్‌లోనే రిలీజ్ అయ్యి సూపర్‌హిట్ అయ్యాయి. ఇక, అన్నపూర్ణ స్టూడియోస్ సారధ్యంలో తెరకెక్కించిన సినిమాలను కూడా డిసెంబర్‌లోనే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటాడు నాగార్జున.
అన్నపూర్ణ బ్యానర్ మీద వచ్చిన సత్యం, ఉయ్యాల జంపాలా సినిమాలు కూడా డిసెంబర్‌లోనే రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ హీరోగా చేసిన ‘హలో’ సినిమా డిసెంబర్‌లో రిలీజైంది.
బాలకృష్ణకు సంక్రాంతి..
హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా మంచి జోష్‌తో సినిమాలు చేస్తూ ఉంటారు నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna). అయితే బాలకృష్ణ కూడా ఒక సెంటిమెంట్‌ను ఫాలో అవుతుంటారు. సంక్రాంతి బరిలో నిలిపిన తన సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ సాధిస్తాయని నమ్ముతారు బాలయ్య.
1987వ సంవత్సరంలో వచ్చిన 'భార్గవ రాముడు ' సినిమా నుంచి ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ నేపథ్యంలో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ, గౌతమీపుత్ర శాతకర్ణి, జై సింహా, ఎన్టీఆర్ కథానాయకుడు వరకు.. సంక్రాంతి బరిలో నిలిచిన అన్ని సినిమాలూ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలే.
వైజాగ్‌లో షూటింగ్..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా ఒక సెంటిమెంట్‌ను ఉంది. అదేంటంటే తన సినిమాలో కనీసం ఒక్క సీన్ అయినా వైజాగ్‌లో షూటింగ్ జరిగేలా ప్లాన్ చేసుకుంటాడని టాక్. అల్లు అర్జున్ హీరోగా నటించిన పరుగు, సరైనోడు, జులాయి సినిమాలే అందుకు ఉదాహరణ. అయితే కొన్ని సందర్భాల్లో సెంటిమెంట్ వర్కవుట్ అయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో.. వర్క్‌వుట్ కాని సందర్భాలు కూడా అనే ఉన్నాయి,