RRR Updates (ఆర్ఆర్ఆర్ అప్ డేట్స్) : ఎన్టీఆర్‌‌ డూప్‌కి అంత రెమ్యూనరేషనా?

Updated on May 12, 2022 12:03 AM IST
ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌లో ఎన్టీఆర్‌‌కు డూప్‌గా ఇమ్రాన్ అనే వ్యక్తి నటించాడు
ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌లో ఎన్టీఆర్‌‌కు డూప్‌గా ఇమ్రాన్ అనే వ్యక్తి నటించాడు

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌.. యంగ్‌ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌‌స్టార్ రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కిన భారీ సినిమా. ఇప్పటికే విడుదలైన ప్రతిచోటా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.  సుమారు రూ.1,100 కోట్లు కలెక్ట్‌ చేసి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అలాగే ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌‌లు భారీ పారితోషికమే తీసుకున్నారు.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి సినిమాలోనూ హీరోలకు గాను, కొన్ని సీన్లలో డూప్‌లు ఉండడం సహజం. అలాగే ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌లో కూడా ఎన్టీఆర్‌‌కు డూప్‌గా ఇమ్రాన్ అనే వ్యక్తి నటించాడు.

ఎన్నో కష్టమైన సీన్లలో  ఎన్టీఆర్‌‌ స్వయంగా నటించినప్పటికీ, కొన్ని సీన్లలో మాత్రం ఇమ్రాన్ సహాయం తీసుకుంది చిత్ర యూనిట్. అలా నటించినందుకు, తనకు రూ.2 లక్షలు రెమ్యూనరేషన్‌ ఇచ్చారని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఇమ్రాన్ చెప్పాడు. సినిమా హిట్‌ అవ్వడంతో తనకు కూడా మంచిపేరు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ కోసం ఎన్టీఆర్‌‌ చాలా కష్టపడ్డాడని చెప్పాడు.

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!