Raashi Khanna : రాశి ఖన్నా రియల్ లైఫ్‌ సీక్రెట్స్ ఇవే ! 'పక్కా కమర్షియల్' సినీ ప్రమోషన్స్‌లో బిజీగా ఢిల్లీ భామ

Updated on Jun 23, 2022 08:37 PM IST
మీకో విషయం తెలుసా? రాశీ ఖన్నా (Raashi Khanna) కాలేజీ రోజులలో అన్ని సబ్జెక్టులలోనూ టాపర్‌గా ఉండేవారట. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో బీఏ (ఇంగ్లీష్) హానర్స్ చేసిన ఈమె, ఐఏఎస్ పరీక్షలకు కూడా ప్రిపేర్ అయ్యారట.
మీకో విషయం తెలుసా? రాశీ ఖన్నా (Raashi Khanna) కాలేజీ రోజులలో అన్ని సబ్జెక్టులలోనూ టాపర్‌గా ఉండేవారట. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో బీఏ (ఇంగ్లీష్) హానర్స్ చేసిన ఈమె, ఐఏఎస్ పరీక్షలకు కూడా ప్రిపేర్ అయ్యారట.

రాశీ ఖన్నా (Raashi Khanna) .. 'ఊహలు గుసగులాడే' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ఢిల్లీ భామ, అనతికాలంలోనే టాలీవుడ్ టాప్ కథానాయికగా మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లాంటి నటులతో కలిసి నటించింది. తను తెరంగేట్రం చేసింది హిందీ చిత్రంతో అయినా.. తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలతోనే బాగా పాపులర్ అయ్యింది రాశీ ఖన్నా.  

ప్రస్తుతం గోపిచంద్ నటించిన 'పక్కా కమర్షియల్' చిత్రంతో  మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి వచ్చేస్తుంది. ఈ క్రమంలో ఆమె గతంలో పలు ఇంటర్వ్యూలలో పంచుకున్న రియల్ లైఫ్ సీక్రెట్స్ మీకోసం ప్రత్యేకం.

ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నదే లక్ష్యం
మీకో విషయం తెలుసా? రాశీ ఖన్నా (Raashi Khanna) కాలేజీ రోజులలో అన్ని సబ్జెక్టులలోనూ టాపర్‌గా ఉండేవారట. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో బీఏ (ఇంగ్లీష్) హానర్స్ చేసిన ఈమె, ఐఏఎస్ పరీక్షలకు కూడా ప్రిపేర్ అయ్యారట. తనకు మోడలింగ్ లేదా సినీ అవకాశాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదని, కానీ అనుకోకుండా ఈ రంగంలోకి వచ్చానని చెబుతుంటారామె

యాడ్స్ కాపీలు రాయడంలో నేర్పరి
రాశి ఖన్నాకి ఇంగ్లీష్‌లో మంచి పట్టు ఉందట. ముఖ్యంగా ఇంగ్లీష్‌లో యాడ్ కాపీస్ వ్రాయడంలో ఎనలేని అనుభవం ఉందట. సినిమాల్లోకి రాకముందు, ఈమె ప్రముఖ ఏజెన్సీలలో కాపీరైటర్‌గా కూడా పనిచేశారట. 

జీవితాన్ని మలుపు తిప్పిన మద్రాస్ కేఫ్
ఒక రకంగా మద్రాస్ కేఫ్ చిత్రం రాశీ ఖన్నా (Raashi Khanna) జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రంలో నటన చూశాకే తెలుగు దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్ రాశీని కలిశారట. తన సినిమా 'ఊహలు గుసగుసలాడే' లో నటించమని కోరారట. 

అధిక బరువు మీద నెటిజన్ల కామెంట్లు
తన కెరీర్ తొలినాళ్ళలో రాశీ ఖన్నా (Raashi Khanna) కాస్త వెయిట్ పెరిగేసరికి, నెటిజన్లు చాలామంది ఆమె శరీరంపై దారుణమైన కామెంట్స్ చేసేవారట. పీసీఓడీ సమస్య వల్లే తను వెయిట్ పెరిగానని ఆమె తెలిపారు. ఈ క్రమంలో ఆమె కొంత అసౌకర్యానికి కూడా గురయ్యేవారట. కానీ, తర్వాత అటువంటి కామెంట్లను పట్టించుకోవడం మానేశారని, ఎక్కువగా స్పిరిచ్యువల్ అంశాలపై తన గురి ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు. 

ఆ పుస్తకం అంటే చాలా ఇష్టం
డాక్టర్ బ్రియాన్ వేస్ రచించిన ఓన్లీ లవ్ ఈజ్ రియల్ అనే పుస్తకం రాశికి చాలా ఇష్టమట. అలాగే రాశికి పుస్తకాలు చదవడం అనేది ప్రధానమైన హాబీ కూడా. 

ఈమె అభిమాన నటులు వీరే
మహేష్ బాబు, రణ్‌బీర్ తన అభిమాన నటులని రాశీ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. 

 

ఇష్టమైన సినిమాలు
బొమ్మరిల్లు (తెలుగు), ఖూబ్ సూరత్ (హిందీ).. ఈ రెండు చిత్రాలు రాశి ఖన్నాకి చాలా ఇష్టమైన సినిమాలట

అందాదూన్ రీమేక్‌లో ఛాన్స్
హిందీ సినిమా అందాదూన్‌‌ రీమేక్ వెర్షన్‌లో రాధికా ఆప్టే పోషించిన పాత్రలో తనకు నటించేందుకు తొలుత ఛాన్స్ వచ్చిందని.. కానీ తాను రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చారు రాశీ. సాధారణంగా ఒక సినిమా చూశాక, ఆ పాత్ర ప్రభావం తన మీద పడుతుందని.. అలాంటప్పుడు తిరిగి తనను ఆ పాత్రలో చూడాలని అనుకోనని ఆమె తెలిపారు.

తొలిప్రేమ, జై లవకుశ, ప్రతి రోజూ పండగే, వెంకీ మామ, సుప్రీమ్, బెంగాల్ టైగర్ లాంటి తెలుగు చిత్రాలలో నటించిన రాశీ ఖన్నా (Raashi Khanna).. ఇప్పుుడు గోపిచంద్ సరసన పక్కా కమర్షియల్ మూవీలో నటిస్తున్నారు. 

Read More: గోపీచంద్‌ (Gopichand) పక్కా కమర్షియల్ సినిమా నుంచి అందాల రాశి ఫుల్‌ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!