గోపీచంద్‌ (Gopichand) పక్కా కమర్షియల్ సినిమా నుంచి అందాల రాశి ఫుల్‌ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

Updated on May 29, 2022 02:01 PM IST
గోపీచంద్‌ (Gopichand) పక్కా కమర్షియల్ సినిమా పోస్టర్
గోపీచంద్‌ (Gopichand) పక్కా కమర్షియల్ సినిమా పోస్టర్

హీరోగా, విలన్‌గా తనను తాను ప్రూవ్‌ చేసుకున్నాడు గోపీచంద్ (Gopichand). విభిన్న కథలను సెలెక్ట్ చేసుకుంటూ మాస్, క్లాస్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కొంతకాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న గోపీచంద్‌కు సీటీమార్ సినిమా కొంత ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఆ జోష్‌తో తన తర్వాతి సినిమా ‘పక్కా కమర్షయల్’ షూటింగ్‌ స్టార్ట్‌ చేశాడీ హీరో.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్‌ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కామెడీతోపాటు యాక్షన్‌ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ సినిమా జూలై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన పలు అప్‌డేట్‌లను రివీల్ చేస్తోంది. ఇందులో భాగంగానే అందాల రాశి అనే సాంగ్‌ ప్రోమోను విడుదల చేసింది. 

గోపీచంద్‌ (Gopichand) పక్కా కమర్షియల్ సినిమా పోస్టర్

‘అందాల రాశి మేక‌ప్ వేసి.. నాకోసం వ‌చ్చావే’ అంటూ సాగే ఈ మెలోడీని సాయి చర‌ణ్‌, ర‌మ్య బెహారా పాడారు. కృష్ణ కాంత్ సాహిత్యం అందించిన ఈ పాట పూర్తి లిరిక‌ల్ వీడియో జూన్ 1న విడుద‌ల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుద‌లైన టైటిల్ సాంగ్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాలో గోపిచంద్‌కు జోడీగా రాశీఖ‌న్నా న‌టించింది. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యూవీ క్రియేష‌న్స్‌, జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్లపై బ‌న్నివాస్‌, వంశీ, ప్రమోద్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించాడు.

ముందు హీరోగా.. తర్వాత విలన్‌గా..

తొలివలపు సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన గోపీచంద్‌ (Gopichand).. జయం, నిజం, వర్షం సినిమాల్లో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యజ్ఞం సినిమాతో మరోసారి హీరోగా మారిన గోపీ ఆంధ్రుడు, రణం, ఒక్కడున్నాడు. లక్ష్యం, ఒంటరి, గోలీమార్, సాహసం, జిల్ వంటి హిట్‌ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!