Sharwanand : శర్వానంద్ సరసన రాశీఖన్నా.. టాలీవుడ్‌లో సరికొత్త కాంబినేషన్ !

Updated on Jun 07, 2022 03:13 PM IST
హీరో శర్వానంద్, రాశీఖన్నా (Hero Sharwanand, Raashi Khanna)
హీరో శర్వానంద్, రాశీఖన్నా (Hero Sharwanand, Raashi Khanna)

టాలీవుడ్‌లో కొన్నాళ్లుగా మంచి బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో శ‌ర్వానంద్ (Sharwanand).  ఎక్స్‌ప్రెస్ రాజా, ర‌న్ రాజా ర‌న్, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, మ‌హానుభావుడు లాంటి సినిమాలు ఈయనకు ఎంతో పేరు తీసుకొచ్చాయి. కానీ, ఆ త‌ర్వాత స‌రైన సినిమాలు ఎంచుకోకపోవడం వల్ల.. అత‌డి కెరీర్ గాడి త‌ప్పింది.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అద్భుతాలు చేస్తాయ‌నుకున్న 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు', 'మ‌హాస‌ముద్రం' లాంటి సినిమాలు కూడా దారుణ‌మైన డిజాస్ట‌ర్లుగా మిగ‌ల‌డంతో, శ‌ర్వానందర్ మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. శర్వానంద్ కొత్త సినిమా 'ఒకే ఒక జీవితం' ఎప్పుడో పూర్తయినా, విడుదల మాత్రం వాయిదా పడిపోయింది. ఈ చిత్రంపై నిర్మాతలు కూడా ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు.

ఈ చిత్రాన్ని థియేటర్లలోనే వదులుతారా లేక ఓటిటికి ఇచ్చే ఆలోచన ఉందా? అనే విషయం కూడా తెలియదు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో అమల అక్కినేని (Akkineni Amala) ఓ కీలక పాత్ర పోషించారు.

ఈ విషయాన్ని కాస్తా పక్కన పెడితే, శర్వా ప్రస్తుతం ఒక కొత్త కాంబినేషన్‌ని సెట్ చేసుకున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కానున్న యాక్షన్ ఎంటర్ టైనర్‌లో శర్వానంద్ నటిస్తున్నాడు. అలాగే, ఈ చిత్రంతో మళ్ళీ కంబ్యాక్ అవుతాననే నమ్మకంతో ఉన్నాడు.

కాగా, ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇందులో కథానాయికగా రాశీ ఖన్నా (Raashi Khanna) నటించనున్నారు. తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తీ సురేష్‌ను అనుకున్నప్పటికీ... చివరకు రాశీ ఖన్నాని ఓకే చేశారు నిర్మాతలు. ఇటీవలే ఆమెకు దర్శకుడు కథను కూడా వినిపించారు.  కథ విన్న వెంటనే.. ఆమె ఓకే కూడా చెప్పేశారని తెలిసింది. రాశీ ఖన్నా ఇప్పటి వరకూ చేయనటువంటి పాత్రని ఇందులో చేయనున్నారట. అందుకే మరో ఆలోచన లేకుండా సినిమాలో నటించేందుకు అంగీకరించారని తెలుస్తోంది. ఈ సినిమాలో రాశీ స్టైల్, లుక్ చాలా కొత్తగా ఉంటాయని టాక్. 

రాశీ ఖన్నా హీరోయిన్.. మరి ప్రియమణి ? 

మరోవైపు.. శర్వానంద్ సినిమాలో రాశీ ఖన్నాతో పాటు ప్రియమణి (Priyamani) కూడా ఓ ముఖ్యపాత్రలో నటించనున్నారు.  సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రియమణి కథలో భాగమై ఉంటారట. ఆమె గోదావరి యాసలో మాట్లాడతారని సమాచారం. ఇక, ఈ సినిమా కథకు వస్తే... రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న వినోదాత్మక చిత్రమిది.

గోదావరి జిల్లాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఓ సాధారణ యువకుడు కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడనే కాన్సెప్ట్‌తో, ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆగస్టులో  ఈ సినిమా షూటింగ్ కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. హైదరాబాద్, రాజమండ్రి, కారైకుడి తదితర ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేయనున్నారు. 

మరోవైపు, కృష్ణ‌చైత‌న్య ( Krishna Chaitanya) యంగ్ హీరో నితిన్‌తో 'ప‌వ‌ర్ పేట్' అనే సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఈ ప్రాజెక్టు ర‌ద్ద‌యింది. ఇపుడిదే చిత్రాన్ని లేదా దానికి అనుబంధంగా ఉండే స్టోరీని ఆధారంగా చేసుకొని కృష్ణ‌చైత‌న్య, శ‌ర్వానంద్‌తో  సినిమా చేస్తున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రోవైపు రాశీఖ‌న్నా ప్ర‌స్తుతం మారుతి-గోపీచంద్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌'లో కథానాయికగా న‌టిస్తోంది.

Read More: ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేది హీరో, హీరోయిన్ల కోసమే.. అల్లు అరవింద్‌ (Allu Aravind) కామెంట్స్ వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!